దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రెడీమేడ్ దుస్తుల వ్యాపారి మోహిందర్ సింగ్, అతని భార్య దిల్జీత్ కౌర్ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఇంట్లో శవాలుగా పడి ఉన్నారు. దంపతుల నివాసానికి సమీపంలోనే ఇద్దరు కుమారులు, కుమార్తె నివాసం ఉంటుంది. అయితే గత మూడు రోజులుగా తల్లిదండ్రులను చూసేందుకు రాలేదు. అయితే డ్రైవర్ చూసేసరికి చనిపోయి ఉన్నారు. సమాచారం పిల్లలకు చేరవేయడంతో డబుల్ మర్డర్ వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: బడ్జెట్లో ప్రవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ
పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. గొంతుకోసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే కేర్‌టేకర్ పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులు క్రితమే కొత్తగా కేర్ టేకర్ జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం అతడు కనిపించకుండా పోయాడు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. భర్తను గొంతుకోసి చంపగా… భార్యను ఇనుపరాడ్‌తో కొట్టినట్లు పోలీసులు తెలిపారు.
రవి అనే వ్యక్తి కేర్‌టేకర్‌గా ఉంటున్నాడు. అయితే ఆరోగ్యం బాగోలేదని సెలవు అడిగాడు. రవి సెలవు అడిగి తన స్థానంలో మరొక వ్యక్తిని నియమించి వెళ్లాడు. అయితే వృద్ధ దంపతులు రవి నియమించిన వ్యక్తిని అంగీకరించారు. అయితే ఇంట్లో లాకర్ పగులగొట్టే ప్రయత్నం చేసినట్లుగా ఆనవాళ్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: కుల మతాలతో సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్యాభ్యాసం..
వృద్ధ దంపతుల ఇంటి సమీపంలోనే ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. కానీ మూడు రోజులుగా ఇటువైపు రాలేదు. డ్రైవర్ చెప్పాకే ఈ విషయం తెలిసిందని కుమారుడు చరణ్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. డ్రైవర్ ఇంటి బెల్ మోగిస్తే… ఎవరూ స్పందించలేదని చెప్పాడు. తండ్రి మృతదేహం ఒకచోట… తల్లి మృతదేహం మరొక చోట ఉందని తెలిపాడు. ఇక సీసీటీవీ ఫుటేజ్‌లో కేర్‌టేకర్ బ్యాక్‌ప్యాక్‌తో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ బ్యాగ్‌లో ఏమున్నాయో తెలియదన్నాడు. మొహిందర్ సింగ్ చివరిసారిగా ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సజీవంగా కనిపించారు. దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారని ఒక పోలీస్ అధికారి తెలిపారు. చనిపోయి రెండు, మూడు రోజులు అయి ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అలాగే పరారీలో ఉన్న రవిని కూడా పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Delhi: పార్లమెంట్‌ను సందర్శించిన బిల్‌గేట్స్