సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకోసం కొత్త నిబందనలను కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబందనలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి. కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త ఐటి నిబందనలు యూజర్ల గోప్యతకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే కేంద్రం తీసుకొచ్చిన నిబందలను అడ్డుకోవాలని కోరుతూ వాట్సాప్ డిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దేశ భద్రతకు లేదా ప్రజలకు హాని కలిగించే విధంగా ఏవైనా పోస్టులను పెడితే ఆ వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేలా కొత్త నిబందనలు…
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్య పద్ధతిలో ఆమోదించుకున్న “మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు” రద్దు చేయాలని, కనీస మద్దతు ధర(ఎంఎస్పి)కు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై నేటికి ఆరు నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల పట్ల మోడీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ, “సంయుక్త కిసాన్ మోర్చా” మే 26 వ తేదీన “బ్లాక్ డే” నిర్వహించాలని పిలుపునిచ్చారు.…
కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత ఆరు నెలలుగా దేశంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ, కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోలేదు. ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి తీవ్రతరం కావడంతో రైతులు ఢిల్లీని వదిలి వెనక్కి వెళ్లారు. అయితే, ఈ నెల 26 వ తేదీన బ్లాక్ డే నిర్వహించాలని భారత్ కిసాన్ యూనియన్, కిసాన్ సంయుక్త మోర్చా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హర్యానా, పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకునేందుకు బయలుదేరి వెళ్లారు.…
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో కొంతమేర కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివిటి రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు లాక్ డౌన్ ను సడలిస్తే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు లాక్ డౌన్ అమలులో…
ఓ దశలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టించింది.. ఎప్పుడూలేని విధంగా సెకండ్ వేవ్‌లో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి.. దీంతో.. అప్రమత్తమైన ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్డౌన్ ప్రకటించారు.. దీంతో.. కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పుడుతున్నాయి.. దాదాపు నెల పదిహేను రోజుల తర్వాత ఇవాళ అత్యల్పంగా 2,260 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఏప్రిల్ 22న ఏకంగా 36 శాతంగా నమోదైన కరోనా పాజిటివిటీ రేటు..…
కరోనా సెకండ్ వేవ్ సామాన్యుల ప్రాణాలే కాదు.. పెద్ద సంఖ్యలో వైద్యుల ప్రాణాలు కూడా తీస్తోంది… కనిపించని వైరస్‌తో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు పెద్దల సంఖ్యలో దాని బారినపడుతూనే ఉన్నారు.. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయిన తర్వాత దేశవ్యాప్తంగా 420 మంది వైద్యులు మరణించారని ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోసియేష (ఐఎంఏ).. అందులో కేవలం ఢిల్లీలోనే 100 మంది వైద్యులు మృతిచెందారని.. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్‌లోనే వైద్యులు…
సింగపూర్ స్ట్రెయిన్‌తో భారత్‌లో థర్డ్ వేవ్ ప్రభావం ఉందని.. ఇది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. వెంటనే ఆ దేశం నుంచి విమానాల రాకపోలకు నిలిపివేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు.. మరోసారి కేంద్రం వర్సెస్ ఢిల్లీ సర్కార్‌గా మారిపోయాయి.. సింగపూర్ వేరియంట్ పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టింది కేంద్రం.. ఆయన వ్యాఖ్యలపై సింగపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. స్పందించిన భారత ప్రభుత్వం.. అరవింద్ కేజ్రీవాల్..…
భారత్‌ను కరోనా సెకండ్ వేవ్ అల్ల కల్లోలం చేస్తోంది.. దాని దెబ్బకు చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి.. మరికొన్ని రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. అయితే, థర్డ్ వేవ్ ముప్పు కూడా లేకపోలేదని.. అది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.. సింగపూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన……
భారత దేశంలో పురాతన కాలం నుంచి కొన్ని రకాల ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. చనిపోయిన పెద్దవాళ్లకు శ్రార్ధ కర్మలు నిర్వహిస్తుంటారు. ఈ శ్రార్ధ కర్మల్లో పిండ ప్రధానం ప్రధానమైనది. పిండప్రదానం చేయడానికి కాకులు అవసరం అవుతాయి. కానీ, పెరిగిపోతున్న నగరీకరణ, రేడియేషన్ కారణంగా కాకులు అంతరించిపోతున్నాయి. దీంతో పెద్ద పెద్ద నగరాల్లో కాకులు మచ్చుకైనా కనిపించడం లేదు. అయితే, ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన దీనిని ఉపాధిగా మార్చుకున్నాడు. రెండు కాకులను పెంచి పెద్ద చేశాడు. …
భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం సెంటర్ విస్టా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సెంటర్ విస్టా ప్రాజెక్టులో కొత్త పార్లమెంట్ భవనం, సెక్రటేరియట్, ఉప రాష్ట్రపతి, ప్రధాని కొత్త నివాసాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 2026 వరకు పూర్తి కానున్నది. కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూ కోసం కేంద్రం రూ. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది. 75 వ స్వాతంత్ర తరువాత జరిగే…