దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేశవ్ పురం ప్రాంతంలోని లారెన్స్ రోడ్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలోని ఒక కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇక సమీప నివాసాల దగ్గర దట్టంగా పొగ కమ్ముకుంది. దీంతో ప్రజలు భయటకు వచ్చేశారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం 14 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం గురించి గానీ.. గాయాలు గురించి గానీ అధికారులు సమాచారం ఇవ్వలేదు. అలాగే ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా తెలియలేదు.
#WATCH | Delhi: Fire broke out in a factory near HDFC Bank, Lawrence Road, in the Keshav Puram area. 14 fire tenders rushed to the spot. So far, no casualties or injuries have been reported pic.twitter.com/2Ym5RgpE13
— ANI (@ANI) April 21, 2025