Building Collapses: దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. పట్టపగలే మేఘావృతం అయింది. అంతేకాకుండా గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తం అయింది. ఈ మేరకు ప్రయాణికులను హెచ్చరించారు.
Crime In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నాడు మూడు హత్యలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది.
దేశ రాజధాని ఢిల్లీలో బాలుడి(17) హత్య తీవ్ర కలకలం రేపింది. సీలంపూర్‌లో బాలుడిని కొందరు దుండగులు చంపేసి పరారయ్యారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా వరుసగా మూడో రోజు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రియాంకతో కలిసి విచారణ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో అధికారులు అడుగుతున్న ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తదుపరి చీఫ్ జస్టిస్‌గా గవాయ్ పేరును కొలీజియం ప్రాతిపాదించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. తాజాగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
మనీలాండరింగ్ కేసులో రెండోరోజు విచారణకు ఈడీ కార్యాలయానికి రాబర్ట్ వాద్రా వచ్చారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం ఎదుట ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విచారణకు వెళ్లే ముందు రాబర్ట్ వాద్రాను భార్య ప్రియాంకాగాంధీ కౌగిలించుకుని లోపలికి పంపించారు.
ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. బుధవారం ఉదయం 4:43 గంటలకు హిందూకుష్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్సీఎస్) అధికారులు తెలిపారు.