ఈరోజు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞన్ భవన్‌లో ఈ భేటీ జరుగుతున్నది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో భేటీ అమిత్‌షా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల గురించి ఈ మీటింగ్‌లో చర్చిస్తున్నారు. అదేవిధంగా, మావోయిస్టులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా వారిని అడ్డుకోవాలి తదితర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చిస్తున్నారు. రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి, రోడ్లు, వంతెనలు, పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు.
Read: ఆఫ్ఘన్‌లో మీడియాపై ఉక్కుపాదం… కొత్త నిబంధనలతో ఆంక్షలు కఠినం…