దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ తాజాగా మరోసారి పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.24 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.77 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర…
పంజాబ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉండటంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఎలాగైనా విజయం సాధించేందుకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచిత విద్యుత్ హామీని ప్రకటించింది. ఢిల్లీలో సమర్థవంతంగా ఈ హామీ అమలవుతున్నప్పుడు పంజాబ్‌లో ఎందుకు ఉచిత విద్యుత్ హామీ అమలుకాదని ఆప్ ప్రశ్నిస్తోంది. ఇక ఇదిలా ఉంటే, పంజాబ్…
లఖింపుర్ ఖేరిలో ఘటనల మీద కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలకు ప్రధాని మోడీ న్యాయం చేయాలని, ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రాను పదవి నుంచి తప్పించాలని, ఆయన కుమారుడిని అరెస్టు చేయాలన్నారు. రైతులకు న్యాయం చేయాలని, నిందితులకు శిక్షపడాలని ఈ దేశంలోని ప్రతి పౌరుడూ కోరుకుంటున్నారని చెప్పారు. మరోవైపు.. లఖింపుర్ ఖేరి ఘటనలో కేంద్ర…
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను ఆమోదిస్తూ దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. 17 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా.. ఇద్దరిని మినహాయించి 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.. తాజా నిర్ణయంతో ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు బదిలీయ్యారు.. ఏపీ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ రవినాథ్ తిలహరి, ఆషానుద్దీన్ అమానుల్లా నియమితులు కాగా.. తెలంగాణ హైకోర్టు…
కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలోని రోడ్లను దిగ్బంధం చేశారు. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేస్తున్నారు. అటు హర్యానా, ఉత్తర ప్రదేశ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. రైతులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…
పాతతరం విమానాలను వియానాయ సంస్థలు వేలం వేసి తుక్కుకింద అమ్మేస్తుంటాయి. ఇలానే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఓ విమానాన్ని ఇటీవలే తుక్కుకింద విక్రయించారు. అలా విక్రయించిన విమానాన్ని ఢిల్లీలోని రహదారి గుండా తరలిస్తుండగా వంతెన కింద ఇరుక్కుపోయింది. వంతెన కింద ఇరుక్కుపోవడంతో ఆ దృశ్యాలను కొంతమంది వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని సేవల నుంచి ఎయిర్…
రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లో నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోడీ.. జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతిని.. భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకుని.. ఇవాళ ఉదయం రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లో నివాళులర్పించారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ.. వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. మరోవైపు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు రెండు ఘాట్ల దగ్గర పుష్పాంజలి ఘటించారు. ఇక, ఇద్దరు నేతల జయంతి…
సీఎం కేసీఆర్‌తోపాటు హస్తిన వెళ్లిన ఎమ్మెల్యేలు సంబరాల్లో ఉన్నారా? కీలక పదవులు దక్కుతాయని ఎమ్మెల్యేల అనుచరులు గాలిలో తేలిపోతున్నారా? ఇంతకీ ఢిల్లీలో జరిగిన చర్చలేంటి? నియోజకవర్గాల్లో నెలకొన్న హడావిడి ఏంటి? ఎవరా ఎమ్మెల్యేలు? లెట్స్ వాచ్..! జడ్చర్ల, నారాయణపేట, దేవరకద్ర ఎమ్మెల్యేలపై చర్చ..! ఉమ్మడి పాలమూరు జిల్లా టీఆర్ఎస్లో ప్రస్తుతం సంబరాల రాంబాబుల గురించి ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలతోపాటు.. వారి అనుచరులు ఊహాలోకాల్లో తేలిపోతున్నారట. మన టైమ్ వచ్చిందని.. ఇక పిలుపు రావడమే మిగిలిందని…
ఢిల్లీలో చీర కట్టుకున్నందుకు ఓ మహిళకు ఎంట్రీ నిరాకరించిన అక్విల్ రెస్టారెంట్‌కు నోటీసులు జారీ అయ్యాయి. రెస్టారెంట్‌ను మూసేయాలంటూ సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు పంపింది. ఆండ్రూస్ గంజ్‌లోని అన్సల్ ప్లాజా వద్ద ఉన్న అక్విల్ రెస్టారెంట్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నట్టు తెలిపారు అధికారులు. ఈనెల 21న పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ అక్కడకు వెళ్లి హెల్త్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో రెస్టారెంట్ నడుపుతున్నట్టు గుర్తించారు. ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నట్టు అధికారి దృష్టికి…
పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఏకంగా అమిత్‌షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారగా.. ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారంటూ ప్రచారం సాగుతోంది.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ అనూహ్య రాజీనామాతో సంక్షోభం ముదిరింది. అమరీందర్, సిద్ధూ మధ్య విభేదాలు పార్టీని నట్టేట ముంచేలా కనిపిస్తున్నాయి.. ఓవైపు సంక్షోభం కొనసాగుతున్న వేళ.. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి…