వైపీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అసాంఘీక శక్తులకు చంద్రబాబు రారాజు అని, ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి వచ్చారా? ఏపీ పరువు తీశామని చెప్పుకోవడానికి వచ్చారా అని ప్రశ్నాంచారు. పట్టాభి బూతు పురాణం వీడియోను రాష్ట్రపతికి చూపించారా? అమిత్ షా మీద రాళ్లు వేసిన వీడియోను చూపించారా? అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సమయం అసన్నమైంది… సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.. ఇక, ఈ సెషన్లో ప్రభుత్వం ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం-2013 సవరణ బిల్లు, అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949 సవరణ బిల్లు ఈ…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.. ఏపీలో పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు హస్తినకు వెళ్లింది చంద్రబాబు టీమ్.. అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశానికి ప్రయత్నించి విఫలం అయినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కినట్టుగా చెబుతున్నారు.. కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమయం ఇచ్చినప్పుడు మళ్లీ ఢిల్లీకి వచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.. ఇక, ఇంగ్లీషు, హిందీ (జాతీయ మీడియా) మీడియా…
ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్ ఇప్పుడు హస్తినను తాకింది.. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఆయన.. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను ఏకరువు పెట్టింది.. నాలుగు ప్రధాన అంశాలను ప్రెసిడెంట్ ముందు పెట్టారు.. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి అందజేసింది చంద్రబాబు టీమ్.. లిక్కర్, డ్రగ్స్, మైనింగ్, సాండ్ మాఫియా విస్తరించిందని.. న్యాయ, మీడియాతో సహా అన్ని వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఆయన…
ఏపీలో రాజకీయాలు మరోసారి హిటెక్కాయి. టీడీపీ నేత పట్టాభి ఎపిసోడ్ తో గడిచిన రెండుమూడ్రోజులుగా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఎవరికీవారు తగ్గెదేలే అన్నట్లు వ్యహరిస్తుండటంతో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే టీడీపీ తన సమస్యను ఆంధ్రప్రదేశ్ సమస్యగా చూపిస్తూ పోరాటం చేస్తుండటంతో ఆపార్టీకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. ఇదే అదనుగా వైసీపీ సైతం టీడీపీపై ఎదురుదాడికి దిగుతోంది. దీంతో ఏపీలో పొలిటికల్ వార్ కు తెరలేచినట్లయింది. పట్టాభి…
మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. ఇక తాజాగా మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.24 చేరగా.. లీటర్…
రోడ్లను బ్లాక్ చేసే అధికారం ఎవ్వరికి లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రోడ్లపై ఆందోళన చేస్తున్న అన్నదాతల క్యాంప్‌లు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజువారి కార్యకలాలపాలకు అంతరాయం కలగడంతోపాటు ప్రజా రవాణా ఆటంకం కలుగుతుంది. ఈ అంశంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ అనే మహిళా సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ పిల్‌ను విచారించిన జస్టిస్ ఎస్కే కౌల్, ఎంఎం సుందేరేశ్‌లతో కూడిన…
కోవిడ్ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచినా.. మళ్లీ కోవిడ్ తగ్గడంతో ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన, పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలతో సామాన్యులు సతమతమవుతుంటే తాజాగా, చలికాలం ప్రారంభం కావడంతో రైళ్లలో ఇచ్చే బెడ్షీట్లు, దుప్పట్లు కావాలంటే జేబులకు చిల్లులు పడనున్నాయి. ఇకనుంచి రైల్వే శాఖ రూ.30 నుంచిరూ.300 వరకు ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నది. వాస్తవానికి కోవిడ్‌కు ముందు బెడ్షీట్లు,దుప్పట్లు రైల్వే శాఖనే ఉచితంగా ఇచ్చేది. ఢీల్లీతో సహా పలు రైల్వే స్టేషన్లలలో డిస్పోజబుల్…
కరోనా కారణంగా చాలా కాలంపాటు ఆంక్షలు కొనసాగడంతో కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది. కాగా, ఆంక్షలను చాలా వరకు ఎత్తివేశారు. రోడ్డుమీదకు వాహనాలు తిరిగి పరుగులు తీస్తున్నాయి. దీంతో వాయుకాలుష్యం తిరిగి మొదలైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 పాయింట్లు దాటడంతో పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ సరిహద్దుల్లో పంట వ్యర్థాల దహనంతో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్నది. పంట వ్యర్థాలను…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సమావేశంలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మాలను వెల్లడించారు.. ద్రవ్యోల్బణం, రైతాంగ సమస్యలు, రైతులపై జరుగుతున్న దాడులపై, తాజా రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది సీడబ్ల్యూసీ.. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి…