ఇవాళ ఢిల్లీకి సీఎం కేసీఆర్..కేంద్రంతో ఢీ అంటే ఢీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం, రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో కుల గణన., తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో సమరానికి సిద్ధమయ్యారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ధర్నాలు చేసినా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదని మండిపడ్డారు. దాన్యం కొనుగోళ్లపై ఇవాళ కేంద్ర పెద్దలతో మంత్రులు, అధికార బృందం చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ప్రధాని అపాయింట్ మెంట్ దొరికితే పలు అంశాలను ప్రస్తావించే యోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టే రైతులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని సీఎం డిమాండ్ చేశారు.
Also Read
రైతు పోరాటంలో మరణించిన 750 కుటుంబాలకు తెలంగాణ తరఫున 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. కేంద్రం కూడా ఒక్కో కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, గోదావరి, కృష్ణా నదుల నీటి పంపకాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ చట్టం రద్దు తదితర అంశాలపై కూడా ఢిల్లీతో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ధర్నా చేసిన రోజున తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని అన్నారని… చివరి ప్రయత్నంగా ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. మరి కేసీఆర్ డిమాండ్లపై కేంద్ర పెద్దలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
తాజావార్తలు
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!