సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తదుపరి చీఫ్ జస్టిస్‌గా గవాయ్ పేరును కొలీజియం ప్రాతిపాదించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. తాజాగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
మనీలాండరింగ్ కేసులో రెండోరోజు విచారణకు ఈడీ కార్యాలయానికి రాబర్ట్ వాద్రా వచ్చారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం ఎదుట ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విచారణకు వెళ్లే ముందు రాబర్ట్ వాద్రాను భార్య ప్రియాంకాగాంధీ కౌగిలించుకుని లోపలికి పంపించారు.
ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. బుధవారం ఉదయం 4:43 గంటలకు హిందూకుష్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్సీఎస్) అధికారులు తెలిపారు.
Nitin Gadkari: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హస్తినలో మూడు రోజులుంటే చాలు వ్యాధి రావడం ఖాయమన్నారు. కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై రెడ్‌జోన్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను గురువారం ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం పాటియాలా ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.
బీహార్‌లో దారుణం జరిగింది. పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. కుమార్తె వేరే కులం యువకుడితో ఢిల్లీ పారిపోయిందని తండ్రి పగతో రగిలిపోయాడు. దీంతో ఆమె జాడ కోసం వెతకాడు. మొత్తానికి కుమార్తెను ఒప్పించి ఇంటికి తీసుకొచ్చాక దారుణంగా హతమార్చాడు.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవూర్ రాణా ఢిల్లీ చేరుకున్నాడు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో రాణాను ఢిల్లీకి తీసుకొచ్చారు. రాణాను న్యాయస్థానం ఎదుట హాజరు పరచనున్నారు.