RRR Delhi Promotionsలో రాజమౌళిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కి 65 నైట్స్ పట్టింది. కానీ వాటన్నింటికన్నా రాజమౌళి ఛాలెంజింగ్ గా అన్పించారు అంటూ దర్శక దిగ్గజంపై పంచులు వేశారు తారక్. ఆదివారం ఢిల్లీలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ ఈవెంట్ లో సినిమా చేసేటప్పుడు ఛాలెంజింగ్ గా అనిపించిన విషయమేంటి ? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా తారక్ ప్రతి సీన్ ఛాలెంజింగ్ గానే అన్పించింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ కి అయితే ఏకంగా 65 నైట్ పట్టింది. ఇవన్నీ ఓకే ఎత్తైతే… అన్నింటికంటే ఎక్కువగా రాజమౌళి ఛాలెంజింగ్ గా అన్పించారు. సాధారణంగా నేను నమ్మేది కొంతమంది దర్శకులు 99% యాక్టింగ్ ఓకే అనుకుంటారు. కనీసం 99.5% అనుకుందాం… కానీ ఈయన మాత్రం అలా కాదు ప్రతి సన్నివేశం 100% కావాలంటారు. నాకు 100% ఇచ్చేసి, తరువాత కెమెరాల నుంచి పక్కకు తప్పుకోండి అంటారు. ఈ విషయాన్ని చెర్రీ కూడా ఒప్పుకుంటాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also : RRR in Delhi : తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు… వీడియో వైరల్