ఢిల్లీ సహా ఉత్తరాదిని చలి వణికిస్తోంది. ఢిల్లీలో ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీలకు పడిపోయాయి. ఢిల్లీలోని లోధి రోడ్లో 2.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి.
తడాది నవంబర్లో ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 26న చోటుచేసుకుంది.
దిల్లీలో యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాద సమయంలో యువతి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై మరో యువతి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే తాజాగా యువతి మృతదేహం శవపరీక్ష పూర్తి అయింది
ప్రజా ప్రతినిధుల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పరిమితులు విధించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించాలని.. ప్రజా ప్రతినిధులు చేసే విద్వేష వ్యాఖ్యల వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషన్ దాఖలైంది.
నూతన సంవత్సరం వేళ ఢిల్లీలోని సుల్తాన్పురిలో ఆదివారం తెల్లవారుజామున 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టి ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. కిలోమీటర్ల మేర యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్ల ఆమె శరీరం ఛిద్రమెంది. యువతిని కారు ఈడ్చుకెళ్లడాన్ని చూసిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించగా.. అన్ని చెక్పోస్ట్లను అలర్ట్ చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Delhi Woman Dies After Car Drags Her For 12 Kilometres On New Year Morning: న్యూ ఇయర్ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒళ్లుగగుర్పాటుకు గురయ్యే యాక్సిడెంట్ ఢిల్లీలో జరిగింది. మహిళను ఢీకొట్టిన తర్వాత దాదాపుగా 10-12 కిలోమీటర్లు లాక్కెలింది కారు. ఈ ప్రమాదంలో మహిళ శరీరం దాదాపుగా ఛిద్రం అయింది. ఈ ఘటన ఢిల్లీలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మృతురాలు అంజలి (20) ఢిల్లీ నివాసి. మహిళ పెళ్లిళ్లకు,…
3.8 Magnitude Earthquake In Haryana, Tremors Felt In Delhi: కొత్త సంవత్సరంలో మొదటి రోజే భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున హర్యానాలోని ఝజ్జర్ లో రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపం ధాటికి ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. హర్యానా భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించలేదు. భూ ఉపరితలానికి 5 కిలోమీటర్లలో లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. అంతకు…
Thread Tied To Boy Private Part: ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల విద్యార్థి మర్మాంగానికి సీనియర్లు నైలాన్ దారం కట్టారు.