PM Narendra Modi Gives Unique Reply To Student On Criticism: ప్రధాని నరేంద్ర మోడీ 2018 నుంచి ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! పరీక్షలపై విద్యార్తుల్లో ఉన్న ఒత్తిడిని, భయాన్ని దూరం చేసి.. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం కోసమే ఈ కార్యక్రమాన్ని మోడీ చేపట్టారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో ఆరో ఎడిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థి మోడీకి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న అడిగాడు. ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కుంటారు? అని ప్రశ్నించాడు. ఇందుకు మోడీ వెంటనే బదులిస్తూ.. ‘‘ఇది ఔట్ ఆఫ్ సిలబస్’’ అని చమత్కరించారు. అంటే.. ఇది సిలబస్‌లో లేని ప్రశ్న అని జవాబిచ్చారు. దీంతో.. అక్కడ నవ్వులు పూశాయి.
IND vs NZ 1st T20: దుమ్మురేపిన డెవాన్, డేరిల్.. భారత్ లక్ష్యం 177
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘నువ్వు అడిగిన ఈ ప్రశ్న సిలబస్‌లో లేదు. అయితే విమర్శ అనేది సుసంపన్న ప్రజాస్వామ్యం కోసం జరిగే శుద్ధి యజ్ఞమని నేను నమ్ముతాను. మీరు కష్టపడే వారు, నిజాయతీపరులైతే.. విమర్శల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అవే మీ బలం అవుతాయి. ఆలోచించండి.. విశ్లేషించండి.. పనిచేయండి.. ఆపైన మీరు కోరుకున్నది సాధించేందుకు కృషి చేయండి’’ అని చెప్పారు. అనంతరం.. మార్కుల విషయంలో అనవసర ఒత్తిడికి గురికావద్దని, కేవలం లక్ష్యంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆ తర్వాత సమయపాలనపై సూచనలిస్తూ.. సమయపాలన అనేది కేవలం పరీక్షలకు మాత్రమే కాదని, రోజువారి జీవితంలో చాలా ముఖ్యమని అన్నారు. ఒకసారి మన అమ్మలను గమనిస్తే, సమయాన్ని సరిగ్గా ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందన్నారు.
Kurnool Tragedy: మరో 20 రోజుల్లో పెళ్లి.. కానీ ఇంతలోనే..
ఇదే సమయంలో చీటింగ్ చేయొద్దని, ఆ క్రియేటివిటీని మంచి పనుల కోసం ఉపయోగించాల్సిందిగా ప్రధాని మోడీ స్టూడెంట్స్‌కి చెప్పారు. కొందరు విద్యార్థులు పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు చాలా క్రియేటివిటీ ఉపయోగిస్తుంటారని.. వారందారూ తమ సమయాన్ని, క్రియేటివిటీని మంచి పద్ధతిలో ఉపయోగిస్తే గొప్ప విజయాలను అందుకుంటారని స్టూడెంట్స్‌లో ఆత్మవిశ్వాసం నింపారు. జీవితంలో షార్ట్ కట్స్‌ను ఎన్నడూ ఎంచుకోవద్దని, వాటి వల్ల కొన్ని విపరీతమైన పరిణామాల్ని ఎదుర్కోవలసి వస్తుందని మోడీ సలహా ఇచ్చారు.