Republic Day 2023: దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత్ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో గల కర్తవ్యపథ్‌లో మొదటి సారిగా పరేడ్‌ను నిర్వహించారు. ఈ పరేడ్‌లో త్రివిధ దళాలు తమ సత్తాను చాటాయి. గణతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతితో కలిసి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతే అల్ సీసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము గౌరవవందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఈజిప్ట్ నుంచి వచ్చిన 120 మంది సైనికుల ప్రత్యేక బృందం కూడా ఈ కవాతులో పాల్గొంది.
ఈ కవాతులో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ ట్యాంకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం పదిన్నరకు విజయ్‌చౌక్ వద్ద కవాతు మొదలై ఎర్రకోట వరకు సాగుతోంది. దీనిలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన అందరిని ఆకర్శించింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న ఈ శకటాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి పండగను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. అలాగే గుజరాత్, అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
India-Pakistan: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఎస్‌సీఓ సమ్మిట్‌కు ఆహ్వానించనున్న భారత్
కర్తవ్య్‌పథ్ పరేడ్‌లో భారత నౌకాదళం, వైమానిక దళం శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 861బ్రహ్మోస్ రెజిమెంట్ డిటాచ్‌మెంట్ ఈ కవాతులో పాల్గొంది. ఒంటెలతో కూడిన బీఎస్‌ఎఫ్ బృందం ఆకట్టుకుంది. పరేడ్‌లో కేవలం మేడ్-ఇన్-ఇండియా ఆయుధ వ్యవస్థలు మాత్రమే ప్రదర్శించబడ్డాయి, ఇందులో మందుగుండు సామగ్రితో సహా భారతదేశ స్వదేశీకరణ శక్తిని ప్రదర్శించారు.