ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై గురువారం లోక్సభలో చర్చిస్తున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన అన్నారు.
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తి అతి దారుణంగా వెంటాడి.. వెంటాడి పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. దారుణాన్ని అక్కడి వారు చూస్తూ ఉండిపోయారు తప్ప.. ఎవ్వరు అడ్డుకొనే ప్రయత్నం చెయ్యలేక పోయారు.. చివరికి కొందరూ వ్యక్తులు ఆ నిందితుడిపై కర్రలతో దాడి చేసి.. పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. నిందితుడిని విచారించిన అనంతరం కేసుకు సంబంధించిన సమాచారం ఇస్తూ.. కేవలం రూ.3000 కోసం ఆ యువకుడిని …
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు కుటుంబ సమేతంగా ఆయన మోడీని కలవనున్నారు. అనంతరం ఎల్లుండి( శుక్రవారం) బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరారు. తరుణ్ చుగ్, కిషన్ రెడ్డిల సమక్షంలో ఆమె కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి చూడటం వల్లే బీజేపీ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు
హర్యానాలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ అయ్యారు. హర్యానాలో మాదిరిగా ఢిల్లీలో అల్లర్లు జరగకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు నేతలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఉదయం 9 గంటలకు వీరు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. అనంతరం వీరు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.
రైతులపై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. మూడు గంటల కరెంట్ ఇస్తే ఎవరికి రైతులు ఉరెస్తారో చూడు అని ఎద్దేవా చేశారు. వరద ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో దిక్కు లేదని కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతున్నారు..
Delhi Records Cleanest Air in July for Last 4 Years: దేశ రాజధాని ఢిల్లీ ‘వాయు కాలుష్యం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల నుంచి వెలుబడే పొగ, చలికాలంలో వచ్చే పొగ మంచుతో పాటు పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నుంచి వచ్చే పొగతో ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంటుంది. వాయు నాణ్యత సూచీ ఒక్కోసారి నాలుగు వందలకు పైగా కూడా నమోదవుతుంది. సూచీలో 401 నుంచి 500…
Eye Flu: ఆగకుండా కురుస్తున్న వర్షాలు, వాటి వల్ల వచ్చే వరదలు, అపరిశుభ్రత.. ఇవన్నీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ కారణాలతో ప్రజలు ఒకవైపు తమ రోజువారీ పనులు పూర్తి చేసుకోవడంలో ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు వీటి కారణంగా రోగాల బారిన పడుతున్నారు.