G20 Summit: భారత్ మరికొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మక జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అగ్రదేశాల అధినేతలు, అధికారులతో ఢిల్లీ పూర్తిగా సందడిగా మారనుంది.
Pollution: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ఈ కాలుష్యం రానున్న కాలంలో ఢిల్లీ వాసులపై పెను ప్రమాదాన్ని మోపుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
G20 Summit: వచ్చే నెలలో జరగబోతున్న జీ20 సమావేశాలకు భారత్ వేదిక కాబోతోంది. జీ20 దేశాధినేతలు ఇండియా రాబోతున్నారు. ఈ క్రమంలో వారిందరికి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ఎదురుచూస్తోంది.
భారత్లో జీ20 సమ్మిట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీకి ఫోన్ చేసినట్లు తెలిసింది. న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్కు రాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు.
సాధారణంగా పిల్లలను అమ్మేయడానికో, బిక్షాటన చేయించడానికో కిడ్నాప్ చేస్తూ ఉంటారు. వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను, స్కూల్ నుంచి వస్తున్న వారిని, ఫుట్ పాత్ పై పడుకున్న వారిని కిడ్నాప్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఓ జంట ఫుట్ పాత్ పై పడుకున్న నెల రోజుల పసికందును కిడ్నాప్ చేసింది. పోలీసుల విచారణలో కిడ్నాప్ చేయడానికి గల కారణాన్ని వారు వివరించారు. అది విన్న పోలీసులే విస్తుపోయారు. ఇలా కూడా కిడ్నాప్ చేస్తారా అనుకుంటూ…
సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నా.. ఓ జవాన్.. ఆయన భార్య కూడా ప్రభ్వుత్వ ఉద్యోగిణి.. కానీ ఆమె ఉద్యోగం చేయడం అతడికి ఇష్టం లేదు.. అయినా ఆమె రోజూ డ్యూటీకి వెళ్తుంది. ప్రమోషన్ కోసం పరీక్ష రాసేందుకు కూడా రెడీ అయింది. పరీక్ష రాసేందుకు వేరే ప్రాంతానికి వెళ్లి హోటల్ రూమ్ లో ఉండగా.. ఆ టైంలో అక్కడికి వచ్చిన భర్త ఆమె అర చేయి నరికేసి వెళ్లిపోయాడు.
శ్రావణ మాసంలో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు ఫుల్ రద్దీగా మారాయి. అయితే, బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట దొరికింది.