Delhi: ఢిల్లీలోని రోహిణిలోని కేఎన్ కట్జూ మార్గ్ ప్రాంతంలోని వ్యాయామశాలలో ట్రెడ్మిల్లో కరెంట్ సప్లై కారణంగా యువకుడు మరణించాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం ఏడు గంటలకు చోటుచేసుకుంది.
ఢిల్లీలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.. ఓ బాలికను ఇంట్లో పెట్టుకొని పనిచేయించడంతో పాటు చిత్ర హింసలు పెట్టిన ఘటన వెలుగు చూసింది.. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.. దిల్లీ ద్వారక ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళా పైలట్, ఎయిర్లైన్స్ ఉద్యోగి అయిన ఆమె భర్త రెండునెలల క్రితం 10 ఏళ్ల బాలికను తమ ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. అయితే ఆ దంపతులు ఆ అమ్మాయిపై కర్కషంగా ప్రవర్తించి గాయాలపాలు చేశారు. ఆ సమయంలో ఆ…
విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.. పోలవరం ప్రాజెక్టు బకాయిలన్నీ చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. రైల్వేజోన్ ఏర్పాటుపై మాటనిలబెట్టుకోవాలంటూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.
సోనియా గాంధీ ఫోటోను రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. "అమ్మా, ఒత్తిడిలో కూడా దయకు సరైన ఉదాహరణ." అంటూ కామెంట్ రాసుకొచ్చారు.. ఈ ఫోటోలో సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించారు.
బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వరదల్లేని రోడ్ల మార్గాలను ట్విట్టర్లో తెలియజేస్తున్నారు.