ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీలో ఒక సభలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి అస్వస్థతకు గురై.. అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి సహాయం చేయమని వైద్య బృందాన్ని కోరారు.
దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగనున్నందున అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో జరగనున్న G20 సమ్మిట్ సందర్భంగా 80 మంది వైద్యులు, 130 అంబులెన్స్‌ల సముదాయం ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితులను నిర్వహిస్తాయని అధికారులు శుక్రవారం తెలిపారు.
New Delhi: నైరుతి ఢిల్లీలోని ద్వారకలో అడ్రస్ని గుర్తించేందుకు తన సహాయం కోరిన డెలివరీ ఏజెంట్‌పై ఓ మహిళ కత్తితో దాడి చేసింది. ద్వారకలోని సెక్టార్ 23లో శుక్రవారం జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. ఇద్దరి మధ్య జరిగిన విచిత్రమైన పరస్పర చర్యను చూపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ కత్తితో వ్యక్తిపై మూడు నాలుగు సార్లు దాడి చేసింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్…
ఎల్బీనగర్ పీఎస్ లో మహిళపై దాడి ఘటనపై బాధితుల తరపు కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీతో పాటు రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు.
సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్‌కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు. అదే సమయంలో విమాన ప్రమాదంలో యెవ్జెనీ ప్రిగోజిన్ మరణంలో క్రెమ్లిన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన అన్నారు.
ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారిక నివాసం గోడను బుధవారం ఓ క్యాబ్ ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి గోడలో కొంత భాగం కూలిపోయి, ఆ ప్రాంతంలో రంధ్రం ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు
నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి రూ. 24 కోట్ల విలువైన 3.07 కిలోల యాంఫెటమైన్-రకం మత్తు పదార్థాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినందుకు ఢిల్లీకి చెందిన నైజీరియన్ జాతీయుడితో సహా ఇద్దరు వ్యక్తులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది.DRI అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అధికారుల బృందం నిర్దిష్ట నిఘా ఆధారంగా ఉచ్చు వేసి, ఆగస్టు 20న నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 43 ఏళ్ల భారతీయుడిని అడ్డగించింది. అతను కెన్యాలోని నైరోబీ…
రాబోయే G20 సమ్మిట్ కోసం సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు చేస్తూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలను తీసుకొచ్చిన వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. వావి వరుసలు కూడా మర్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. తండ్రికి ఫ్రెండ్ కదా అని నమ్మింది.. చివరికి దారుణంగా మోసపోయింది.. అమ్మాయి తల్లీ ఫిర్యాదు చెయ్యడంతో ఈ విషయం బయటకు వచ్చింది.. తమ కామావాంఛ తీర్చుకోవడానికి.. చిన్నా, పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా.. వరుసలు మరచి పశువులు లాగా రెచ్చిపోతున్నారు.…
సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని రకరకాల ప్రదేశాలను ఎంచుకుంటున్నారు నెటిజన్లు. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా.. ఎక్కడ హైలెట్ గా నిలుస్తారో అక్కడే స్టంట్స్, వీడియోలు చేస్తూ చూపిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో సోషల్ మీడియా వీడియోలకు ఫ్లాట్ ఫాంగా మారింది. ఢిల్లీ మెట్రోలో చాలాసార్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే మెట్రోలో ఇలాంటి వీడియోలు చేయడానికి అనుమతి లేదని పలుమార్లు చెప్పినప్పటికీ.. బుద్ధి మారడం లేదు.…