ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన సమావేశంలో తాను, ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తానీ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి చర్చించుకున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు జీ20 అధ్యక్ష పదవిని అందజేసేటప్పుడు శాంతి కోసం ప్రార్థన ‘స్వస్తి అస్తు విశ్వ’తో G20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు.
G-20 Summit: భారతదేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజు జీ20 సమావేవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి ప్రపంచ నేతలు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో,ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ పీఎం ఫుమియో కిషిడా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా…
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 2022లో యూకే ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి సునక్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి.
జీ20 ఢిల్లీ డిక్లరేషన్ భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగం చేసే ముప్పు నుంచి దూరంగా ఉండాలని దేశాలను కోరింది. ఉక్రెయిన్‌లో సమగ్ర, న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి రష్యా గురించి నేరుగా ప్రస్తావించకుండా అణ్వాయుధాల ఉపయోగం లేదా ముప్పు ఆమోదయోగ్యం కాదని సభ్య దేశాలు కోరాయి.
వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర ప్రపంచ నాయకులు శనివారం జీ20 సమ్మిట్‌లో భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్‌ను ప్రారంభించారు.
దేశ రాజధానిలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో రెండో సెషన్ ప్రారంభమైంది. జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ మొదటి సెషన్లోనే అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. జీ20 తొలి సెషన్‌ను ముగించిన అనంతరం ప్రధాని మోదీ ఈరోజు మీడియాతో మాట్లాడారు. జీవ ఇంధనంపై ప్రపంచ కూటమిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
జీ20 సమ్మిట్‌లో ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఏకాభిప్రాయాన్ని ప్రకటిస్తూ దీనిని సాధ్యం చేసేందుకు కృషి చేసిన జీ20 షెర్పాలు, మంత్రులు, ఇతర అధికారులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.