Delhi: తప్పు చేసిన వ్యక్తులు జైల్లో శిక్ష అనుభవిస్తుంటారు. అయితే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో పాటుగా అక్కడ విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి, అలానే ఖైదీలను చూడడానికి వచ్చే సందర్శకులకు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే ఇక పై ఎవరైనా ఆ నిబంధనలను ఉల్లంగిస్తే నిబంధలను ఉల్లగించిన వాళ్లకు 3 సంవత్సరాలు శిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వివరాల్లోకి వెళ్తే.. జైల్లో ఉన్న ఖైదీలు, సందర్శకులు, చివరికి జైల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు అయినా చట్ట విరుద్ధంగా జైల్లో మొబైల్ ఫోనులు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించిన, అలానే నిషేధిత వస్తువులను ఆధీనం లో ఉన్నచుకున్న, ఉపయోగించేందుకు ప్రయత్నించిన, జైల్లో ఉన్న వాటిని తొలిగించిన.. జైల్లో ఉన్న ఖైదీలకు నిషేధిత వస్తువులను సరఫరా చెయ్యాలని చూసిన.. చట్ట విరుద్ధమైన పనులను చేసేందుకు ప్రయత్నించినా 3 సంవత్సరాల జైలు శిక్ష తో పాటుగా 25 వేల జరిమానాను విధించేందుకు ప్రతిపాదనలను రూపొందించింది.
Read also:Bhatti Vikramarka: ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి.
దీనిలో భాగంగా ఇందుకు సంబంధించిన నమూనా చట్టాన్ని (మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ 2023 ) ని కేంద్ర హోమ్ శాఖ అన్ని రాష్ట్రాలకు పంపింది. ఈ నమూనా ప్రతిపాదన ప్రకారం జైలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ.. పదేపదే నేరాలకు పాల్పడే వాళ్లకు 3 సంవత్సరాలు శిక్ష విధించబడుతుంది. ఒక వేళ ఖైదీ అప్పటికే శిక్ష అనుభవిస్తున్నట్లైతే ఆ ఖైదీ శిక్షా కాలానికి మరో 3 సంవత్సరాలు జోడించబడుతుంది. కాగా ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు (1894, 1900) స్థానంలో కాలానుగుణంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాన్ని రూపొందించినట్లు కేద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు స్వీకరించి అమలు చెయ్యాలని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ బల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈ నమూనా చట్టం లో మొత్తం 21 అధ్యాయాలు ఉన్నాయి.