కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16న అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు ‘ఎక్స్’ ట్విట్టర్ ద్వారా ఆమె తెలియజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఢిల్లీ వెళ్లారు. కాసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో సీఎం, డిప్యూటి సీఎం, మంత్రి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై హైకమాండ్తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. మరోవైపు.. పలువురు కేంద్ర మంత్రులను కూడ…
ప్రపంచంలోనే బీజేపీ (BJP) అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల అజెండాను నిర్దేశించేందుకు భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ సదస్సును ఢిల్లీలో ప్రారంభించింది.
ఢిల్లీలోని (Delhi) రెసిడెన్షియల్ కాలనీ దగ్గర రైలు ప్రమాదం (Trian Accident) జరిగింది. ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడింది. దీంతో 10 వ్యాగన్లు బోల్తా పడ్డాయి.
మోదీ 3.0 పై ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే నేటి నుంచి బీజేపీ జాతీయ సమావేశాలు రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో జరగనున్నాయి.
అన్నదాతలు చేపట్టిన చలో ఢిల్లీ (Farmers Protest) కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. నిరసన దీక్షలో పాల్గొన్న ఓ రైతన్న అసువులు బాశాడు. శంభు సరిహద్దు దగ్గర ప్రాణాలు కోల్పోయాడు.
భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో జాతీయ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల సమావేశాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 11, 500 బీజేపీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.