AP BJP Key Meeting: ఏపీలో పొత్తులపై బీజేపీ ఎటూ తేల్చడం లేదు. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్ట్‌ను రిలీజ్ చేశారు ఆ పార్టీ అధినేతలు. ఈ పొత్తులో తమతో పాటు బీజేపీ కూడా కలుస్తుందని జనసేన అధినే పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలా? లేకుంటే టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలా అనే దానిపై హై కమాండ్ ఎటూ తేల్చడం లేదు. పొత్తుపై ఏ విషయమో క్లారిటీ వస్తే సెకండ్ లిస్ట్ ప్రకటించేందుకు చూస్తుంది టీడీపీ – జనసేన కూటమి. కానీ బీజేపీ మాత్రం కాలయాపన చేస్తూ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అయినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీంతో ఇటు ఏపీ బీజేపీతో పాటు టీడీపీ – జనసేన రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
లోక్‌సభ ఎన్నికల ఎలాగైనా మెజార్టీ సాధించాలని చూస్తుంది బీజేపీ. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటనలు చేస్తుండగా.. మరోవైపు బీజేపీ హైకమాండ్ సమావేశాలు నిర్వహిస్తుంది. నిన్న ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశం జరిగింది. మీటింగ్‌లో కోర్ గ్రూప్ ఏపీ బీజేపీతో కూడా సమావేశమైంది. అయితే పొత్తులపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు..కోర్ కమిటీతో భేటీ అయ్యి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ రెడీ చేసిన 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల ఆశావహుల లిస్టులను అధిష్టానం ముందు పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించారు. ఈ సమావేశంలో పొత్తులపై క్లారిటీ వస్తుందనుకున్నారు నేతలు. అయితే పొత్తుల అంశంపై చర్చకు రాలేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇవాళ మరోసారి అధిష్ఠానంతో సమావేశం కానున్నారు ఏపీ బీజేపీ నేతలు. దీంతో ఇవాళైనా పొత్తులపై చర్చకు వస్తుందా? బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.