Delhi : ఢిల్లీలోని ద్వారకలో అత్తగారు, కోడలు బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న భారీ అగ్నిప్రమాదం వెలుగు చూసింది. అయితే ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది.
పెళ్లి తర్వాత ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా తప్పుపట్టింది. లింగ వివక్షను చూపే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమతించబోదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Delhi : ఘజియాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్న నలుగురు స్నేహితులు యమునా నదిలో మునిగి మృతి చెందిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం తర్వాత ఆ ప్రాంతమంతా సంచలనం రేపుతోంది.
ఢిల్లీలో రైతులు మళ్లీ పోరుబాట పడుతున్నారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఛలో చేపట్టేందుకు రెడీ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఇవాళ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నేటి ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరి మధ్య చర్చలు కొనసాగాయి. కాగా.. తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అందులో భాగంగా.. 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని చెబుతున్నారు పార్టీ శ్రేణులు. కాగా.. ఎన్నికల తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన మూడు నెలల సమయం తర్వాత ఢిల్లీకి వెళ్తున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తుంటి నొప్పితో బాధపడిన కేసీఆర్.. ఇప్పుడిప్పుడే కోలుకుని నడవగలుగుతున్నారు. అంతేకాకుండా.. మొన్న నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.
జమిలి ఎన్నికలపై (One Nation One Election) ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Former President Ram Nath Kovind) ఆధ్వర్యంలో భేటీ అయింది.