S.Jaishankar : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విదేశాంగ విధానం, దానిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
Delhi: బీజేపీ మహిళా కార్యకర్త వర్షా(32)ని దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన తర్వాత ఆమె మృతదేహాన్ని బుధవారం ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్లో బుధవారం పోలీసులు కనుగొన్నారు. నరేలాలోని స్వతంత్ర నగర్లో ఉంటున్న వర్షా అదృశ్యంపై ఆమె తండ్రి విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న వర్షా తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె తన వ్యాపార భాగస్వామి సోహన్ లాల్తో చివరిసారిగా కనిపించింది.
Crime: ఆన్లైన్, సోషల్ మీడియా పరిచయాలు అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. స్నేహితుల పేరుతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు ఇప్పటి వరకు చాలానే నమోదయ్యాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ మైనర్ బాలికపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని దబ్రీ మెట్రోస్టేషన్ సమీపంలో బాలిక అపాస్మారక స్థితిలో కనిపించిందని పోలీసులు బుధవారం వెల్లడించారు.
జమ్మూ కాశ్మీర్లోని జమాతే ఇస్లామీపై (Jamaat-e-Islami) కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థపై విధించిన నిషేధంపై తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
దేశ రాజధాని ఢిల్లీ ఆప్కు (AAP) బీజేపీకి (BJP) ఎంతో కీలకమైంది. ఇక్కడ మొత్తం ఏడు లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం కమలం చేతిలోనే ఉన్నాయి.
Heart attack: ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 24 గంటల్లో భార్యభర్తలు మరణించారు. ఘజియాబాద్లోని ఓ యువ జంట జూ సందర్శనకు వెళ్లారు. 25 ఏళ్ల అభిషేక్ అహ్లువాలి గుండెపోటుతో మరణించగా, అతని భార్య అంజలి షాక్ తట్టుకోలేక ఏడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. గతేడాది నవంబర్ 30న ఇద్దరికి వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Is Akshay Kumar Contest From Chandni Chowk: రానున్న లోక్సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దృషి పెట్టిన పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలో గతంలో గెలిచిన మొత్తం 7 లోక్సభ స్థానాలను తిరిగి ఈసారి కూడా దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోంది. పార్లమెంటులోని సిట్టింగ్ సభ్యులలో కొందరికి అవకాశం రాకపోవచ్చని, వారి స్థానాల్లో కొత్త వారిని నిలబెట్టాలని బీజేపీ…
నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (Droupadi murmu) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు.