దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. అర్ధరాత్రి నుంచి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. నోయిడా, గురుగ్రామ్‌లో భారీ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ఉదయాన్ని ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం 9.4 గంటల ప్రాంతంలో ప్రకంపనలు జరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.4గా నమోదైంది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను ప్రకటించింది. ఇందులో రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి కేంద్ర వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం, దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. 124 సంవత్సరాల తర్వాత అత్యంత భారీ వర్షం శుక్రవారం కురిసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.
దుమ్ము తుఫాన్ కారణంగా శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దాదాపుగా 205 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దేశ రాజధాని ఢిల్లీని దుమ్ము తుఫాన్ బెంబేలెత్తించింది. శుక్రవారం ఊహించని రీతిలో ఈదురుగాలులు హడలెత్తించాయి. దీంతో చెట్లు నేలకూలాయి. శుక్రవారం సాయంత్రం మొదలైన దుమ్ము తుఫాన్ అర్ధరాత్రి వరకు బీభత్సం సృష్టించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం సాయంత్రం హఠాత్తుగా మెరుపులు, గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా హస్తిన వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులు నీట మునిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Rahul Gandhi : ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో ఉన్న కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై దాడి చేశారు. కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లోని బేస్మెంట్లో నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు.