Earthquake: ఢిల్లీలో నిమిషం పాటు భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదు
- ఢిల్లీలో భూప్రకంపనలు
- రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదు
- భయంతో పరుగులు తీసిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం 9.4 గంటల ప్రాంతంలో ప్రకంపనలు జరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.4గా నమోదైంది. నిమిషం పాటు భూమి కంపించింది. హర్యానా రోహతక్ దగ్గర భూకంప కేంద్రం గుర్తించారు. గురుగ్రామ్‌లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియలేదు.
హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ప్రకంపలు చోటుచేసుకున్నాయి. ఇంట్లో ఫ్యాన్లు, ఇతర గృహోపకరణాలు ఊగిపోవడంతో నివాసితులు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. నోయిడా, గురుగ్రామ్‌లోని కార్యాలయాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కంప్యూటర్లు కదిలాయి. ఉద్యోగులంతా కార్యాలయాల నుంచి బయటకు వచ్చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, షామ్లీ వరకు ప్రకంపనలు సంభవించాయి. ఝజ్జర్‌లోని భూకంప కేంద్రం నుంచి 200 కి.మీ దూరం వరకు సంభవించింది.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
ఇది కూడా చదవండి: ENG W vs IND W: ఇన్నాళ్లకు.. ఎట్టకేలకు.. ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ కైవసం చేసుకున్న భారత్..!
మరోవైపు ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురిసిన వానకు నగరం అతలాకుతలం అయింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్ని ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మోకాలి లోతు నీటితో రహదారులు నిండిపోయాయి. ఇక విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక గురు, శుక్రవారాల్లో భారీగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: Maharashtra: స్కూల్ బాత్రూంలో రక్తపు మరకలు.. విద్యార్థి బట్టలు విప్పిన ప్రిన్సిపాల్, ప్యూన్ అరెస్టు
ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ ఉండగా ప్రస్తుతం దాన్ని ఐఎండీ రెడ్ అలర్ట్‌గా ఐఎండీ మార్చింది. నిన్నటి నుంచి ఏకధాటిగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. నజాఫ్‌గఢ్‌లో 60 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం కూడా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది. నెహ్రూ ప్లేస్, అరబిందో మార్గ్, లజ్‌పత్ నగర్ వంటి ప్రాంతాల్లో కూడా తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక గురుగ్రామ్‌లో అయితే చాలా అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు ప్రవేశించాయి. ఈ మేరకు బాధితులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!