దేశ రాజధాని ఢిల్లీని దుమ్ము తుఫాన్ బెంబేలెత్తించింది. శుక్రవారం ఊహించని రీతిలో ఈదురుగాలులు హడలెత్తించాయి. దీంతో చెట్లు నేలకూలాయి. శుక్రవారం సాయంత్రం మొదలైన దుమ్ము తుఫాన్ అర్ధరాత్రి వరకు బీభత్సం సృష్టించింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 205 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికులు దిగ్బంధం అయిపోయారు. గంటల తరబడి విమానాశ్రయలోనే నిరీక్షిస్తున్నారు. అయితే త్వరలోనే సేవలను పునరుద్ధరిస్తామని ఎయిర్‌పోర్టు సిబ్బంది చెప్పుకొస్తున్నారు.
ఇది కూడా చదవండి: AP Inter Results 2025: ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
దుమ్ము తుఫాన్ కారణంగా అనేక విమానాలను దారి మళ్లించి రద్దు చేశారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారి తెలిపారు. దారి మళ్లించిన విమానాలు తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్టు రావడానికి చాలా సమయం పట్టిందని.. దీంతో విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగిందని అధికారి పేర్కొన్నారు. సేవలను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Oscars : ఆస్కార్ పురస్కారాల్లో కొత్త కేటగిరీ..అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రాజమౌళి మూవీ
ఇప్పటికే ఆయా విమాన సంస్థలు ప్రయాణికులను అలర్ట్ చేసింది. అయినా కూడా ప్రయాణికులు తమ కష్టాలను, ఇబ్బందులను ఎక్స్ వేదికగా వ్యక్తం చేస్తున్నారు. కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్న వారంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది తీవ్రంగా మండిపడుతున్నారు
ఇదిలా ఉంటే ఈరోజు కూడా ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విమాన రాకపోకలు తిరిగి నెమ్మది నెమ్మదిగా పునరుద్ధరించబడుతున్నాయని వర్గాలు పేర్కొంటున్నాయి.
#WATCH | Delhi: Branches of trees fell after the National Capital experienced dust storm in several areas.
(Visuals from Mandi House) pic.twitter.com/WDIFs9tv8r
— ANI (@ANI) April 11, 2025
Passenger advisory issued at 19:15 hours.#DelhiAirport #BadWeather pic.twitter.com/RzOovOtgkY
— Delhi Airport (@DelhiAirport) April 11, 2025
@airindia @MoCA_GoI @JM_Scindia Most mismanaged, misinformed world class international airport, New Delhi.#INDIRAGandhi.. worse than Bus Stand . pic.twitter.com/uDQilWIfxq
— Ärvind Lal (@lalarvi) April 12, 2025