Delhi : ఢిల్లీలో శనివారం సాయంత్రం కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత రాజేంద్రనగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ ఒక్కసారిగా నీటితో నిండిపోవడంతో పరిస్థితి నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. గత రెండ్రోజులగా కుండపోత వర్షం కురవడంతో నగరం గజగజ వణికిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
Delhi Rains : ఢిల్లీలో శుక్రవారం కురిసిన వర్షం విధ్వంసం సృష్టించింది. ఢిల్లీలో వర్షం పడినప్పుడు ప్రజలు మొదట ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆకాశం నుండి కురుస్తున్న వర్షం ఇంత విపత్తు సృష్టిస్తుందని వాళ్లు ఊహించి ఉండరు.
Delhi Rains : ఢిల్లీలో తొలి రుతుపవనాల ప్రభావం ఎయిమ్స్‌పై కూడా కనిపించింది. వర్షం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ఆపరేషన్ థియేటర్లు మూతపడటంతో డజన్ల కొద్దీ శస్త్రచికిత్సలు ఆగిపోయాయి.
ఢిల్లీ వాసులు ఎండ వేడిమి నుంచి కాస్త తెప్పరిల్లారు. ఉదయం నుంచి భానుడు భగభగమండిపోయాడు. ఇక బుధవారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. 52.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో హస్తిన వాసులు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయారు
Delhi Weather : దేశ రాజధాని ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీని తర్వాత కూడా ఢిల్లీ ప్రజలకు వాయుకాలుష్యం నుంచి ఉపశమనం లభించలేదు.
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం సూరీడు సుర్రుమంటున్నాడు. ఎండ వేడిమి, తేమకు జనాలు అల్లాడిపోతున్నారు. భారత వాతావరణ విభాగం (IMD) వర్షాలకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ అందించింది.
Delhi Flood: దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా వర్షాలు కురవకపోయినా యమునా నది నీటిమట్టం రికార్డు స్థాయిలోనే కొనసాగుతోంది. గురువారం పల్లా గ్రామ పరిసర ప్రాంతాల్లో యమునా నీటి మట్టం 212.70 మీటర్లకు చేరుకోగా, ఢిల్లీ రైలు వంతెన వద్ద నీటి మట్టం ఉదయం 208.41 వద్ద నమోదైంది.
Hathinikund Barrage: రాజధాని ఢిల్లీ నిజంగానే వరదల్లో చిక్కుకుంటుందా? ప్రస్తుతం యమునా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యేలా కనిపించడం లేదు కాబట్టి ఢిల్లీ వాసుల గుండెల్లో ఈ ప్రశ్న తలెత్తుతోంది.