SIMI Terrorist: నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమి) ఉగ్రవాది హనీఫ్ షేక్ పోలీసులకు చిక్కాడు. 22 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇతడిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ ఫిబ్రవరి 22న అరెస్ట్ చేసింది. కేవలం ఒకే ఒక క్లూ అయిన అతని మారుపేరు సాయంతో భయంకరమైన ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. ఇతడికి హనీఫ్ షేక్, మహ్మద్ హనీఫ్ మరియు హనీఫ్ హుదాయి పేర్లు ఉన్నాయి. 2002లో పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించారు.
2001లో ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఇతడిపై దేశద్రోహ అభియోగాలు, ఉపా చట్టం కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హనీఫ్ షేక్ సిమి ఆధ్వర్యంలో నడిచే ‘ఇస్లామిక్ మూవ్‌మెంట్’ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా ఉన్నాడు. అనేక మంది ముస్లిం యువకులను ర్యాడికలైజ్ చేశాడు. పోలీసులు ఇతడిని పెట్టుకునేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే, పోలీసులకు కేవలం పత్రికలో ఉన్న ‘హనీఫ్ హుదాయి’ అనే ఒకే క్లూ ఉంది. ఢిల్లీ పోలీసులు సదరన్ రేంజ్ స్పెషల్ సెల్ హనీఫ్ షేక్ కోసం నాలుగేళ్లుగా ప్రయత్నిస్తోంది.
Read Also: Haryana: ఐఎన్ఎల్‌డీ చీఫ్ నఫే సింగ్ రాథీని కాల్చి చంపిన దుండగులు..
ఎలా చిక్కాడు:
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళలో జరిగిన సిమి సమావేశాలకు హనీఫ్ షేక్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వీటిపై దాడులు జరిగిన పలు సందర్భాల్లో హనీఫ్ పోలీసుల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ఢిల్లీ పోలీసులు ఇతడి సమాచారాన్ని అనేక రాష్ట్రాలకు పంపింది. ఇతడిని పట్టుకునేందుకు ఏడు రాష్ట్రాల్లో పోలీసులు ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేశారు.
షేక్ తన గుర్తింపు మార్చుకుని మహారాష్ట్రలోని భుసావల్ లోని ఉర్దూ పాఠశాలలో పనిచేస్తున్నట్లు ఇన్‌ఫార్మర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో పక్కా ప్లాన్ చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 22న మహ్మదీన్ నగర్ నుంచి ఖడ్కా రోడ్డుకు వెళ్తున్న అనుమానాస్పద వ్యక్తి హనీఫ్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు షేక్‌ను అడ్డుకుని అరెస్ట్ చేసినట్లు స్పెషల్ సెల్ డీసీపీ అలోక్ కుమార్ చెప్పారు.
హనీఫ్ షేక్ ఎవరు..?
హనీఫ్ షేక్ 1997లో సిమిలఅో చేరాడు. దాని సభ్యుల సాన్నిహిత్యంతో అతను ఉగ్రవాదం వైపు మారాడు. అప్పటి నుంచి పలువురు ముస్లిం యువకులను సిమిలో చేర్చుకోవడం ప్రారంభించాడు. 2001లో అప్పటి సిమి అధ్యక్షుడు సాహిద్ బదర్, ‘ఇస్లామిక్ మూవ్‌మెంట్’ ఉర్దూ ఎడిషన్‌కు హనీఫ్ షేక్‌ను ఎడిటర్‌గా నియమించారు. షేక్ పత్రిక సంపాదకుడిగా ఉన్న సమయంలో భారతదేశంలోని ముస్లింలపై అనేక రెచ్చగొట్టే కథనాలు రాశారు.
ఢిల్లీలోని జకీర్ నగర్ లో సిమి ప్రధాన కార్యాలయంలో హనీఫ్ షేక్‌కి గది ఇచ్చాడు. 2001లో పోలీసుల దాడిలో హనీఫ్ షేక్ మరికొంతమందితో కలిసి తప్పించుకుని అండర్‌గ్రౌండ్‌కు వెళ్లాడు. సిమిలో ప్రజల్ని చేర్చేందుకు యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇతను పర్యటించినట్లు అంగీకరించాడు. సిమిపై నిషేధం విధించడంతో ‘‘వహ్దత్-ఎ-ఇస్లాం’’ పేరుతో కొత్త సంస్థను స్థాపించారు. దీనిలో కూడా సిమిలో ఉన్న సభ్యులే సభ్యులుగా చేరారు. ఈ సంస్థ కీలక సభ్యుల్లో షేక్ ఒకరు. ఈ సంస్థకు నిధుల కోసం విరాళాల ముసుగులో డబ్బు వసూలు చేస్తున్నాడు. ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.