ఢిల్లీ మేయర్ పీఠం కోసం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో భారీ గందరగోళం చెలరేగింది. ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రసాభాస జరిగింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది.
Delhi Civic Polls Today: బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కోసం అంతా సిద్ధం అయింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 250 వార్డులకు 1349 మంది పోటీలో నిలబడ్డారు. 1.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
JP Nadda criticizes Aam Aadmi Party: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్సెస్ బీజేపీగా సాగుతోంది రాజకీయం. ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఢిల్లీలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలోని వజీర్ పూర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీలను ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 4న నిర్వహించబడుతుంది.
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా.. వాటిని 1 చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడింటిని విలీనం చేస్తూ ఢిల్లీ నగరం మొత్తాన్ని ఒకే మునిసిపల్ కార్పొరేషన్ కిందకు తీసుకురానున్నారు అధికారులు. ఇదివరకే ప్రతిపాదించిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం-2022ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.ఈ మేరకు ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల ఏకీకరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్…