Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిందితుడుగా ఉన్నారు. మార్చిలో ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయగా, 50 రోజులు తీహార్ జైలులో ఉన్న తర్వాత, ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన రెండు పిటిషన్లలో ఉపశమనం లభించలేదు. సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర బెయిల్ కొనసాగించాలని.. వైద్య పరీక్షల కోసం రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేసుకున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్‌కి జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో లభించిన రెగ్యులర్ బెయిల్‌ను పొడిగించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును అభ్యర్థించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలంటూ మరో పిటిషన్ వేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. ఆమె బెయిల్‌పై మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు ముగిశారు. సోమవారం కవిత తరపున వాదనలు ముగిశాయి. వాదనలు అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది.
Arvind Kejriwal: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేస్తోందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోరారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌తో పాటు పార్టీని కూడా ఛార్జీషీటులో చేర్చింది.