ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పాత్రను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. 100 కోట్ల రూపాయల నగదు లిక్కర్ స్కాం ద్వారా చేతులు మారినట్లు ఈడీ పేర్కొంది. ఆప్ ఇచ్చిన నగదు మొత్తాన్ని గోవా ఎన్నికల కోసం ఖర్చుపెట్టినట్లు వెల్లడించింది. కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా లావాదేవీలు జరిగినట్లు తెలిపింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది.
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ మంజూరు చేసింది. అయితే, దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్రయించగా, బెయిల్‌పై స్టే విధించింది.
MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి మూడు నెలలు కావస్తోంది. తీహార్ జైలులోని 6 కాంప్లెక్స్‌లో కవిత 80 రోజులుగా ఉంటున్నారు.
తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మెడికల్ పరీక్షల కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనతో చేరేందుకు తన భార్యను అనుమతించాల్సిందిగా అభ్యర్థించారు.
Arvind Kejriwal: ఢిల్లీలో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరింది. నీటి కోసం ప్రజలు ట్యాంకర్ల వెంట గుమిగూడిన దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో కొనసాగుతున్న నీరు మరియు విద్యుత్ సంక్షోభాల మధ్య, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని మంత్రి అతిషీ, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలు ఈ రోజు కలిశారు.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ని కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జూన్ 7 వరకు కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయేందుకు తన నివాసం నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించనున్నారు.