Congress: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోసారి ఆప్ హ్యాట్రిక్ సాధిస్తుందా.? లేక బీజేపీ 27 ఏళ్ల తర్వాత ప్రభంజనం సృష్టిస్తుందా అని ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే, శనివారం మొదలైన ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిపత్యం కొనసాగిస్తోంది
Saurabh Bharadwaj: ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల ముందు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్‌ని అంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. గ్రేటర్ కైలాష్ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఆప్ వెనకంజలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ సత్తా చూపలేకపోతోందని వెల్లడైంది. ప్రస్తుతం సమచారం ప్రకరాం, బీజేపీ -18, ఆప్ -13, కాంగ్రెస్-1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ నేతలు, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు ఢిల్లీ సీఎం ఆతిశీ, ఆప్ అధినేత, అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి జై శంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయినప్పటికి.. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
Delhi Assembly Election 2025 Live UPDATES: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
బీజేపీపై ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎం యంత్రాల ద్వారా 10 శాతం ఓట్లలో వ్యత్యాసాలు కలిగిస్తారని నివేదికల ద్వారా సమాచారం అందిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ నేతలు పార్టీని వీడుతున్నారు.. ప్రజల్లో పార్టీపై ఎంత ఆగ్రహం ఉందో వారు గ్రహించారని ప్రధన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈసారి దేశ రాజధాని ఢిల్లీ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందని అతడు ధీమా వ్యక్తం చేశారు.
AAP vs BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వర్సెస్ బీజేపీ నడుస్తోంది. ఇరు పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ రావణుడు బంగారు జింక రూపంలో వచ్చి సీతని అపహరించాడు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే, శనివారం అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరిగింది. ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆప్ ఆరోపించింది. ఈ ఆరోపణలు ఆమ్, బీజేపీ మధ్య ఘర్షణకు కారణమైంది.
Delhi Election 2025: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ పై రిటర్నింగ్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.