Delhi Election 2025: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ పై రిటర్నింగ్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎం వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వాహనాన్ని వాడుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. జనవరి 7వ తేదీన ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత పీడబ్ల్యూడీ గవర్నమెంట్ వెహికిల్ ఆప్ కార్యాలయానికి ఎన్నికల ప్రచార సామాగ్రిని అందజేస్తోందని ఫిర్యాదులో వెల్లడించారు.
Read Also: Gaza Truce Deal: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. బందీలు విడుదలయ్యే ఛాన్స్..
ఇక, ఈ విషయమై కల్కాజీ నివాసి కేఎస్ దుగ్గల్ గోవింద్‌పురి ఎస్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. సౌత్-ఈస్ట్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కల్కాజీ నుంచి ఎమ్మెల్యేగా అతిషి పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ తరపున రమేష్ బిధూరి, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా బరిలో ఉన్నారు.
Read Also: Harish Rao: కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు పెట్టింది ఎవరు?
అయితే, ఢిల్లీ సీఎం అతిషి ఈరోజు (మంగళవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి సోమవారం నాడే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. భారీ ర్యాలీగా వెళ్లడంతో సమయం అయిపోయింది. దీంతో ఆమె నామినేషన్ వేయకుండా వెనుదిరిగారు. ఇవాళ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉందని ఆప్ వర్గాలు పేర్కొ్న్నాయి. నామినేషన్ వేసేందుకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంటుంది. కేజ్రీవాల్‌తో కలిసి అతిషి ఈసీ కార్యాలయానికి వెళ్లారు. కానీ సమయం దాటిపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేకపోయారు.