Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఆప్ వెనకంజలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ సత్తా చూపలేకపోతోందని వెల్లడైంది. ప్రస్తుతం సమాచారం ప్రకారం, బీజేపీ -18, ఆప్ -13, కాంగ్రెస్-1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఎర్లీ ట్రెండ్స్‌లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనకంజలో ఉండటం సంచలనంగా మారింది. రెండు సార్లు ఢిల్లీకి సీఎంగా ఉన్న కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో వెనకంజలో ఉన్నారు. ఇదే నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. కేజ్రీవాల్‌తో పాటు జంగ్‌పురా నుంచి మనీష్ సిసోడియా, కల్కాజీ నుంచి అతిశీ మార్లెనా వెనకంజలో ఉన్నారు. ఈ స్థానంలో బీజేపీ నేత రమేష్ బిధూరి లీడింగ్‌లో ఉన్నారు.