ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Aravind Kejriwal : లోక్‌సభ ఎన్నికల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) పెద్ద ఊరట లభించింది. పార్టీ అగ్రనేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ లభించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెల్లడించనుంది. ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో జరిగిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు తెలిపింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ కొన్ని నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలేయం, ఊపిరితిత్తులు, గుండెకు చికిత్స పొందుతూ క్రమంగా మరణించే అవకాశం ఉందన్నారు.
Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.
మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను మార్చి 21న అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్‌పై అత్యవసరంగా విచారించాలంటూ బుధవారం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.
తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనను అరెస్ట్ చేయడానికి ఈడీ వద్ద తగినంత ఆధారం ఉందని మంగళవారం కోర్టు స్పష్టం చేసింది. దాంతో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి దారితీసిన తగినంత సమాచారం, ప్రూఫ్స్ ఈడీ వద్ద ఉన్నాయని.. అలాగే కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడం, అలాగే ఆయన వల్ల జరిగిన జాప్యం వల్ల జ్యుడీషియల్…
ప్రస్తుతం జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజగా తన సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ గురువారం ఢిల్లీ సీఎం నుంచి వచ్చిన సందేశాన్ని ఆప్ ఎమ్మెల్యేలకు వినిపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఎమ్మెల్యేలందరికీ ఓ సందేశం పంపారు. తాను జైల్లో ఉన్నాను కాబట్టి.. ఢిల్లీ రాష్ట్ర ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదని., అందుకని రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే ప్రతిరోజూ తమ ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజల సమస్యలపై చర్చించి వాటిని…