RCB vs DC: నేడు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇకపోతే ఢిల్లీ జట్టులో ఒక మార్పు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు…
CSK VS DC : చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 69 పరుగులు…
DC vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా అభిమానుల ఆసక్తిని రేకెత్తించే మరో కీలక పోరు ఇవాళ జరగనుంది. టోర్నమెంట్‌లో 17వ మ్యాచ్‌గానే రికార్డ్ అయ్యిన ఈ సమరం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మైదానంలో జరగనుంది. చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా మారింది. రెండు జట్లూ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ పోరుకు…
ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఇంకా 24 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయసంగా ఛేదించింది.
SRH vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా వైజాగ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ మొదలెట్టిన ఎస్‌ఆర్‌హెచ్ కు ఏమాత్రం కలిసి రాలేదు. ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక సమయలో కేవలం 37 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఇక మొత్తానికి హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ…
SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన కొన్ని మ్యాచ్‌లు ఉత్కంఠ రేపాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య ఆదివారం విశాఖ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో మళ్లీ హోరాహోరీ సమరానికి తెరలేచింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో…
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో రాహుల్ జట్టులోకి చేరే అవకాశం ఉంది. తనకు కూతురు పుట్టిన కారణంగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు రాహుల్ దూరంగా ఉన్నాడు. అయితే.. మార్చి 30న వైజాగ్‌లో జరిగే మ్యాచ్‌లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశముందని ఆ జట్టు ఆటగాడు విపరాజ్ నిగమ్…
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాట్స్‌మన్ అశుతోష్ శర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. క్లియర్ మైండ్‌సెట్‌తో మైదానంలో అడుగుపెట్టి.. పవర్ హిట్టింగ్ చేశాడు. మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 66 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించాడు.
అశుతోష్ శర్మ చేతి వేలు కట్ అయినా మ్యాచ్ ఆడాడు అని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ తెలిపారు. గాయం అయినా మ్యాచ్‌ను తనదైన స్టైల్లో ముగించాడని ప్రశంసించారు. ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఒక వికెట్ తేడాతో గెలిచింది. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకున్న ఢిల్లీని అశుతోష్ మెరుపు హాఫ్…
విప్రజ్ నిగమ్... నిన్నటి వరకు చాలా తక్కువ మందికి ఈ పేరు తెలుసు. అయితే.. 2025 సీజన్ ప్రారంభంలో ఈ యువ ఆటగాడు తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రతి క్రికెట్ ప్రేమికుడి నోట ఇతని పేరే మెదులుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో విప్రజ్ నిగమ్ తన తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన ప్రదర్శించి తన ప్రతిభను చాటాడు. విప్రజ్ తన తొలి మ్యాచ్‌లో ఆల్-రౌండ్ ప్రదర్శనతో మెప్పించాడు.