ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకాబోతోంది. మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనున్నది. ఇప్పటికే ఏర్పా్ట్లన్నీ పూర్తయ్యాయి. ఐపీఎల్ సంగ్రామానికి జట్లన్ని సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ అందించే ఎంటర్ టైన్ మెంట్ అంతాఇంతాకాదు. తమ ఫేవరెట్ క్రికెటర్స్ సిక్సులు, ఫోర్లు బాదుతుంటే గ్రౌండ్ ను హోరెత్తిస్తుంటారు. మ్యాచ్ ల కోసం స్టేడియాల్లో వాలిపోతుంటారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ లకు జనాదారణ కరువైపోయింది.
Also Read:Sunita Williams: సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేస్తోంది.. నాసా లైవ్ షో ఏర్పాటు
ఐపీఎల్ మ్యాచ్ ల పై క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపించడం లేదు. ఆన్ లైన్ లో ఐపీఎల్ టికెట్స్ అమ్ముడుపోవడంలేదు. విశాఖపట్నంలో ఈనెల 24వ తేదీన లక్నో తో ఢిల్లీ తలపడనున్నది. సాధారణంగా హోమ్ టౌన్ లో మ్యాచ్ అంటే టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. కానీ, ఈ మ్యాచ్ కు మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ నుంచి స్పందన రావడం లేదు. నాలుగు రోజులు అవుతున్న ఆదరణ కనిపించడం లేదు. టికెట్ల అమ్మకాలకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం, నిర్వహణ లోపంతో టిక్కెట్లు అమ్ముడుపోవట్లేదని భావిస్తున్నారు.