ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్ 38 బంతుల్లోనే 73 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. నికోలస్ పూరన్ 36 పరుగులతో రాణించాడు. చివర్లో ఆయుష్ బదోని ఏడు బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే.. 194 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. మొదటి ఓవర్‌లో 17 పరుగుల సాధించింది.
Also Read : Salaar: సలార్ ఓవర్సీస్ హక్కులు.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
డేవిడ్ వార్నర్ రెండు బౌండరీలను ఛేదించగా, పృథ్వీ షా కూడా ఒక బౌండరీని కొట్టాడు. అయితే.. 4.3 ఓవర్ల తర్వాత 41 పరుగుల వద్ద ఢిల్లీ మొదటి వికెట్‌ను కోల్పోయింది. అయితే.. ఇదే ఓవర్‌లో మిచ్ మార్ష్ పెవిలియన్ చేరాడు. అయితే.. పదో ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపుకోసం మరో 119 పరుగులు కావాల్సి ఉంది.
Also Read : Mrunal Thakur : నేను అలా చేయడం అమ్మనాన్నకు అస్సలు ఇష్టం లేదు