ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడుతున్నాయి. ఫస్ట్ కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేస్తుంది. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రెచ్చిపోవడంతో కేకేఆర్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు 128 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
Also Read : Special EVM: అసెంబ్లీ ఎన్నికల కోసం కొత్త ఈవీఎంలు.. M-3 EVM ప్రత్యేకత ఏంటంటే?
ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ లిటన్ దాస్( 4 ) ముఖేశ్ కుమార్ బౌలింగ్ లో లలిత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిపోయాడు. దీంతో ఫస్ట్ డౌన్ వచ్చిన వెంకటేశ్ అయ్యర్ డకౌట్ గా వెనుదిరిగాడు. నోర్ట్జే బౌలింగ్ లో షాట్ కు యత్నించిన అయ్యర్ స్లిప్ లో మార్ష్ కు క్యాచ్ ఇచ్చిన పెవిలియన్ బాట పట్టాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా కూడా ఔట్ అయ్యాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది.
Also Read : Rahul Gandhi : విద్యార్థులతో ‘దేశ్ కి బాత్’… రోడ్డుపైనే కూర్చున్న రాహుల్ గాంధీ
కేకేఆర్ వరుస వికెట్లు కోల్పోయిన ఓపెనర్ జేసన్ రాయ్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కాగా బౌలింగ్ కు వచ్చిన అక్షర్ పటేల్ మన్ దీప్ సింగ్ ( 12), రింకు సింగ్ (6)లను ఔట్ చేశాడు. ఇక ఇషాంత్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ కు ట్రై చేసి సునీల్ నరైన్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు బాటపట్టాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్ట్జే, కుల్ దీప్ యాదవ్ లు తలో రెండు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్ ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవలని పట్టుదలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఓటమి పాలైన ఢిల్లీ.. అందుకు తగ్గట్టుగానే బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. అయితే చివర్లో కేకేఆర్ బ్యాటర్ ఆండ్రూ రస్సెల్ ( 38 ) అద్భుతమైన బ్యాటింగ్ తో కేకేఆర్ కు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు.
