SRH vs DC: కుప్పకూలిన టాపార్డర్.. 10 ఓవర్లలో డీసీ పరిస్థితి ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Scored 72 Runs With 5 Wickets Loss In First 10 Overs Against SRH: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మొదటి ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మిచెల్ మార్ష్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ కాసేపు పరుగుల వర్షం కురిపించారు. ముఖ్యంగా.. మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి బ్యాటింగ్ చూసి.. ఈరోజు భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని అంతా భావించారు. కానీ.. 39 పరుగుల వద్ద టి.నటరాజన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
Kenya Cult Deaths: జీసస్‌ని కలిసేందుకు.. ఆకలితో 47 మంది మృతి
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆ తర్వాత కాసేపటికే డేవిడ్ వార్నర్ కూడా ఔటయ్యాడు. ఫ్లిప్ షాట్ కొట్టబోయి, ఫీల్డింగ్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే సర్ఫరాజ్, అమన్ ఖాన్‌లు కూడా.. అతని వెంటే పెవిలియన్ బాట పట్టారు. ఇలా పది ఓవర్లలోపే 5 వికెట్లు కోల్పోయిన డీసీ జట్టు.. కేవలం 72 పరుగులు చేసింది. వార్నర్, మార్ష్ మధ్యలో కాస్త మెరుపులు మెరిపించడం వల్ల.. స్కోరు అంత మాత్రం వచ్చింది. మిగతా వాళ్లు మాత్రం.. కనీస పోరాట పటిమ కనబర్చుకుండానే వికెట్లు సమర్పించుకున్నారు. ప్రస్తుతం క్రీజులో మనీష్ పాండే, అక్షర్ పటేల్ ఉన్నారు. వీళ్లిద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లే కాబట్టి.. వీళ్లే కష్టాల్లో ఉన్న తమ డీసీ జట్టుని కాపాడుకోవాలి. మెరుగైన ఇన్నింగ్స్ ఆడి.. గౌరవప్రదమైన స్కోరుని జోడించాలి. మరి.. వీళ్లు ఎంతమేర రాణిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!