SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ ఘోర పరాజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Won By 7 Runs On Sunrisers Hyderabad: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. ఆ జట్టు నిర్దేశించిన 145 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 పరుగుల తేడాతో గెలుపొందింది. సన్‌రైజర్స్‌లోని స్టార్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడం.. లక్ష్యం చిన్నదే కావడంతో మొదటి నుంచి నిర్లక్ష్యంగా ఆడటంతో.. ఎస్ఆర్‌హెచ్ ఈ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.
Neha Sharma: ఎద అందాలు దాచినా దాగనట్టున్నాయే..
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మనీశ్ పాండే (34), అక్షర్ పటేల్ (34) ఆశాజనకమైన ఇన్నింగ్స్‌తో నెట్టుకురావడం.. అంతకుముందు డేవిడ్ వార్నర్ (21), మిచెల్ మార్ష్ (25) పర్వాలేదనిపించడంతో.. ఢిల్లీ జట్టు ఆ స్థాయి స్కోరు చేయగలిగింది. ఇక 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు.. ఆది నుంచే నిదానంగా ఆడుతూ వచ్చింది. వీలు చిక్కినప్పుడల్లా మయాంక్ అగర్వాల్ ఫోర్లు కొట్టాడు కానీ, బ్రూక్ మాత్రం దారుణ ప్రదర్శన కనబర్చాడు. అతడు 14 బంతుల్లో 7 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. అతని తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి ఏమైనా మ్యాజిక్ చేశాడా అంటే.. అతడు కూడా నిరాశపరిచాడు. 21 బంతులాడిన అతగాడు కేవలం 15 పరుగులే చేశాడు. కెప్టెన్ మార్ర్కమ్ కూడా 3 పరుగులకే జెండా ఎత్తేశాడు. టాపార్డర్‌లో ఎవరైనా బాగా రాణించారంటే.. అది మయాంక్ అగర్వాల్ (49) ఒక్కడే. పాపం.. అతడు ఒక్క పరుగు తేడాతో అర్థశతకం కోల్పోయాడు.
Crime News: దుర్మార్గుడా.. ఎంత పని చేశావ్ రా.. ప్రేమించలేదని నడిరోడ్డుపై
టాపార్డర్ ఘోరంగా విఫలం అవ్వడంతో.. చివర్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. 5 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు క్రీజులో ఉన్న క్లాసెన్, సుందర్.. కాసేపు మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా క్లాసెన్ అయితే దుమ్ముదులిపేశాడు. అతడు ఆడిన ఆటతీరు చూసి.. సన్‌రైజర్స్ విజయం తథ్యమని అంతా భావించారు. కానీ.. 31 వ్యక్తిగత పరుగుల వద్ద అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. భారీ షాట్లు బాదే అవకాశమే ఇవ్వలేదు. కేవలం ఐదంటే ఐదు పరుగులే ఇచ్చాడు. దీంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయఢంకా మోగించింది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్యే, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..