Delhi Capitals Won By 4 Wickets On Kolkata Knight Riders: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ త్రిల్లింగ్ విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేధించింది. డేవిడ్ వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో (57)తో రాణించగా.. చివర్లో అక్షర్ పటేల్ కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకొని, విజయతీరాలకు చేర్చాడు. నిజానికి.. స్వల్ప లక్ష్యం కావడం, మొదట్లో ఢిల్లీ విధ్వంకర ఇన్నింగ్స్ ఆడటంతో.. మ్యాచ్ చాలా త్వరగా ముగుస్తుందని అనుకున్నారు. కానీ.. ఈ మ్యాచ్ అనూహ్యంగా ఉత్కంఠభరితంగా మారింది. కేకేఆర్ వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ చూసి.. ఒకానొక దశలో కేకేఆర్ విజయం సాధిస్తుందేమోనని భావించారు. కానీ.. చివరి ఓవర్‌లో మ్యాచ్ మలుపు తిరగడంతో, ఢిల్లీ నెగ్గింది.
Shilpa Shetty: 47 ఏళ్ళ వయస్సులో కూడా ఆ శరీర సౌష్టవమేలా.. భామా
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు.. 127 పరుగులకి ఆలౌట్ అయ్యింది. జేసన్ రాయ్ (39 బంతుల్లో 43), ఆండ్రూ రసెల్ (31 బంతుల్లో 38) మినహాయించి.. మిగతా బ్యాటర్లెవ్వరూ ఆశాజనకమైన ప్రదర్శన కనబర్చలేదు. మణ్‌దీప్ సింగ్ (12) సోసోగా నెట్టుకొస్తే.. ఇతర బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. అందరూ క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి.. పెవిలియన్ బాట పట్టారు. అందుకే.. కేకేఆర్ 127 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. ఇక 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. 19.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసి, విజయఢంకా మోగించింది. మొదట్లో డీసీ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆరు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. ఆ దూకుడు చూసి.. 15 ఓవర్లలోనే డీసీ ఈ మ్యాచ్‌ని ముగించేస్తుందని క్రీడాభిమానులు ఓ అంచనాకి వచ్చారు. కానీ.. కేకేఆర్ అద్భుతంగా బౌలింగ్ వేసి, డీసీ బ్యాటర్లను కట్టడి చేశారు. భారీ షాట్లు ఆడే ఆస్కారం ఇవ్వలేదు. తద్వారా మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Romance: కామ కోరికలు వారికే ఎక్కువట.. శృంగారాన్ని మహిళలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారంటే..?
ఎప్పుడో ముగుస్తుందనుకున్న ఈ మ్యాచ్.. చివరి ఓవర్ వరకూ సాగింది. డీసీ బ్యాటర్లపై కేకేఆర్ బౌలర్లు ఒత్తిడి తీసుకురావడంతో.. ఎవ్వరూ భారీ షాట్లు కొట్టలేకపోయారు. దూకుడు ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అయితే.. చివరి ఓవర్‌లో మ్యాచ్ డీసీకి అనుకూలంగా మారింది. మొదటి బంతికే డబుల్ తీయడం, బౌలర్ ఒక నో బాల్ కూడా వేయడంతో.. డీసీ గెలుపొందింది. అక్షర్ పటేల్ విన్నింగ్ షాట్ కొట్టి.. తన జట్టుని గెలిపించుకున్నాడు. ఏదేమైనా.. స్వల్ప స్కోరుని డిఫెండ్ చేసుకోవడం కోసం కేకేఆర్ బౌలర్లు చూపించిన పోరాట పటిమను మెచ్చుకోవాల్సిందే.