Rishbh Pant: గొప్ప మనసు చాటుకున్న రిషబ్ పంత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant apologizes to Cameraman in DC vs GT: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గొప్ప మనసు చాటుకున్నాడు. తాను కొట్టిన సిక్సర్‌కు గాయపడిన కెమెరామెన్‌కు క్షమాపణ చెప్పాడు. అంతేకాదు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధించాడు. ఇందుకు సంబందించిన ట్వీట్‌ను ఐపీఎల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. గొప్ప మనసు చాటుకున్న పంత్‌పై ఫాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా బుధవారం గుజరాత్‌పై ఢిల్లీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ చెలరేగాడు. కేవలం 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. పంత్ కొట్టిన ఓ సిక్సర్ బీసీసీఐ కెమెరామెన్ దేబశిశ్ కు బలంగా తాకింది. ఇది తెలిసి పంత్ మ్యాచ్ అనంతరం ఆ కెమెరామెన్‌కు క్షమాపణ సందేశం పంపాడు. ‘సారీ దేబశిశ్ భాయ్. నిన్ను కొట్టాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. వీలైనంత త్వరగా నువ్ కోలుకుని మైదానంలోకి వస్తావని ఆశిస్తున్నా’ అని ఓ వీడియోలో పంత్ పేర్కొన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Itel S24 Price: ‘ఐటెల్’ నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్.. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్!
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రిషబ్ పంత్‌తో పాటు అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ 7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్స్ తీశాడు. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి ఓడిపోయింది. సాయి సుదర్శన్ (65), డేవిడ్ మిల్లర్ (55) అర్ధ సెంచరీలు చేశారు.
One of the camerapersons from our BCCI Production Crew got hit during the #DCvGT match.
Rishabh Pant – Delhi Capitals’ captain and Player of the Match – has a special message for the cameraperson. #TATAIPL | @DelhiCapitals | @RishabhPant17 pic.twitter.com/wpziGSkafJ
— IndianPremierLeague (@IPL) April 24, 2024
తాజావార్తలు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?