ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం తొలి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు రూ.2,500 సాయం అందిస్తున్నట్లు రేఖా గుప్తా తెలిపారు. మహిళా సమ్మాన్ యోజన పథకం కోసం మొత్తం రూ.5,100 కోట్లు మంజూరు చేసింది. దేశ రాజధానిలో అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 సాయం అందిస్తామని పేర్కొన్నారు.
ఢిల్లీలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. గత ఆప్ ప్రభుత్వ విధానాలపై అసెంబ్లీలో కాగ్ రిపోర్టులను బీజేపీ బహిర్గతం చేస్తోంది. ఇటీవల మద్యం కుంభకోణానికి సంబంధించిన రిపోర్టును ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బయటపెట్టారు.
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల వేదికగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి వాడీవేడీగానే జరుగుతోంది. ఇటీవల గత ప్రభుత్వ పాలనపై కాగ్ రిపోర్టును ముఖ్యమంత్రి రేఖా గుప్తా సభలో ప్రవేశపెట్టారు.
ఢిల్లీ అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది. బీజేపీ ప్రభుత్వం.. శాసనసభలో గత ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ రిపోర్టును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
Delhi : నేడి నుంచి రాజధాని ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికార పార్టీలో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోనుంది.
Atishi: మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషిని ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలిగా ఉండబోతోంది. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు అతిషిని తమ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న రేఖా గుప్తాని బలంగా ఎదుర్కొనేందుకు మరో మహిళా నేత అతిషిని ఆప్ రంగంలోకి దించింది. Read Also: Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ…
దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా యుద్ధం సాగిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ కుర్చీ మారిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ సీటు సంఖ్య 1 నుంచి 41కి మారింది.