ఢిల్లీ అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది. బీజేపీ ప్రభుత్వం.. శాసనసభలో గత ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ రిపోర్టును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అంబేద్కర్, భగత్ సింగ్ చిత్ర పటాలు తొలగింపును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్.. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అతిషి సహా 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Roja: చాలా రోజుల తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రోజా..
గత ఆప్ ప్రభుత్వం.. అవినీతికి పాల్పడిందని బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. మద్యం కుంభకోణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇక అంబేద్కర్ ఫొటో తొలగించి ప్రధాని మోడీ ఫొటో పెట్టడంపై అతిషి నిరసన వ్యక్తం చేశారు. తిరిగి అంబేద్కర్ ఫొటో పెట్టేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: కుంభమేళాలో మహా రికార్డు.. అమెరికా జనాభాను మించి..
ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. సోమవారమే తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేశారు. తొలుత ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఇక స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. ఇక మంగళవారం సభను ఉద్దేశించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా ప్రసగించారు.
#WATCH | Delhi LG VK Saxena says, "… We have instructed the heads of all departments to make a 100-day plan and an outline of development works that need to be done. In the first cabinet meeting of my government, it was decided that the CAG report would be tabled in the… pic.twitter.com/dJgz6AYStX
— ANI (@ANI) February 25, 2025
#WATCH | Delhi: After being suspended from the Legislative Assembly for the whole day, former CM and Delhi LoP Atishi says, "BJP has replaced the portrait of Dr Babasaheb Bhimrao Ambedkar with that of PM Modi in the CM office, cabinet ministers office…Is PM Modi bigger than Dr… pic.twitter.com/06yEnlWgOr
— ANI (@ANI) February 25, 2025