ఢిల్లీలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. గత ఆప్ ప్రభుత్వ విధానాలపై అసెంబ్లీలో కాగ్ రిపోర్టులను బీజేపీ బహిర్గతం చేస్తోంది. ఇటీవల మద్యం కుంభకోణానికి సంబంధించిన రిపోర్టును ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బయటపెట్టారు. రూ.2 వేల కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. తాజాగా వైద్య రంగానికి సంబంధించిన రిపోర్టును బహిర్గతం చేశారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా వదిలేసిందని ఆరోపించింది. ఆరోగ్య భద్రత, మౌలిక వసతుల కల్పనలో గత సర్కార్ పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, కరోనా సమయంలోనూ నిధులను సక్రమంగా వినియోగించలేకపోయిందని సంచలన విషయాలు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: AP Agriculture Budget: ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్.. రైతులకు శుభవార్త..
గత ఆరేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాల్లో తీవ్ర అవినీతికి పాల్పడిందని కాగ్ పేర్కొంది. మొహల్లా క్లినిక్స్‌లో తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం దగ్గరి నుంచి అత్యవసర నిధులను వినియోగించకపోవడం దాకా ఎన్నో వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఢిల్లీలో ఉన్న 27 ఆస్పత్రుల్లో 14 హాస్పిటల్స్‌లో ఐసీయూ సదుపాయం లేదని వెల్లడించింది. 16 ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులు లేవని పేర్కొంది. ఎనిమిది ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేదని తెలిపింది. పదిహేన్నింటిలో మార్చురీ సదుపాయాల్లేవని వెల్లడించింది. 12 ఆస్పత్రులకు ఆంబులెన్స్ సదుపాయాలు లేవని స్పష్టం చేసింది.
ఢిల్లీ అసెంబ్లీలో అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలు నిరసన తెలపడంతో సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆప్ ఎమ్మెల్యేలను సభలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు అతిషి లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దృష్టి పెట్టాలని కోరారు.
ఇది కూడా చదవండి: Wife Harassment: భార్య వేధింపులు తట్టుకోలేక మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య