తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మళ్లీ ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్చలు ప్రారంభించకపోవడంతో డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు 101 మంది రైతుల 'జాతా' ప్రారంభమవుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.
జీప్ ఇండియా తన ప్రీమియం, అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ జీప్ కంపాస్‌పై డిసెంబర్‌లో భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ మోడల్‌పై వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. వినియోగదారుల ఆఫర్‌పై రూ. 3.20 లక్షలు, కార్పొరేట్ ఆఫర్ కింద రూ. 1.40 లక్షలు తగ్గించింది. వీటన్నింటితో పాటు కంపెనీ దీనిపై రూ.15,000 ప్రత్యేక ఆఫర్ కూడా ఇస్తోంది. దీంతో మీరు ఈ SUVపై రూ. 4.75 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర…
బ్యాంకుల్లో వారానికి ఐదు రోజులే పని దినాలు అమలు చేయాలంటూ యూనియన్ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. అధిక ఒత్తిడి కారణంగా ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బ తింటుందని ఎంప్లాయిస్ వాపోతున్నారు.
సంక్రాంతికి ఒక నెల ముందే ..డిసెంబరులో ఈసారి కొత్త సినిమాల జాతర కనిపిస్తోంది. డిసెంబర్లో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు భారీ, మీడియం, చిన్న సినిమాలు వరుస కట్టాయి.డిసెంబర్ మొదటి వారం బాక్సాఫీసుని రూల్ చేయడానికి ‘పుష్ప 2’తో వస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 రిలీజ్ తర్వాత మిగతా సినిమాలు క్రిస్మస్ సెలవులని టార్గెట్ చేశాయి. ఏకంగా డజను సినిమాలు చివరి రెండు వారాల్లో వస్తున్నాయి. అల్లరి నరేశ్ ‘బచ్చలమల్లి’తో డిసెంబరు 20న వస్తున్నాడు.ఇదొక రియల్ లైఫ్…
Upcoming Smart Phones: మరో 30 రోజుల్లో 2024 సంవత్సరం ముగియబోతోంది. ఇకపోతే, ఈ సంవత్సరం ముగిసేలోపు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తమ జనాదరణ పొందిన అనేక ఉత్పత్తులను పరిచయం చేయడానికి రెడీ ఐపోయాయి. డిసెంబర్ నెలలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు బడా బ్రాండ్స్ నుండి విడుదల కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో పెను సంచలనాలను సృష్టించగలవని కంపెనీలు భావిస్తున్నాయి. ఎందుకంటే, శక్తివంతమైన ఫీచర్లు ఇంకా ఆకర్షణీయమైన ధరల అద్భుతమైన కలయికతో రాబోతున్నాయి. మరి ఆ మొబైల్స్ ఏంటో…
వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ప్రత్యేక రైలును నడపబోతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కరెంటుతో కానీ, డీజిల్‌తో కానీ పనిచేయదు. బదులుగా రైలు 'నీటి'తో నడుస్తుంది. మొదటి రైలు మార్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్ణయించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ గగన్‌యాన్ మిషన్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన రాకెట్‌లోని మూడు దశలు శ్రీహరికోటలోని షార్ రేంజ్‌కు చేరుకున్నాయని ఆయన శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఏజెన్సీ తన మొదటి టెస్ట్ ఫ్లైట్‌ను ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రూప్-2 పరీక్షల వాయిదాపై టీజీపీఎస్సీ (TGPSC) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 7,8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనుంది టీజీపీఎస్సీ. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కాసేపటి క్రితమే ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఆగష్టు 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గ్రూప్ 2 పోస్టులను పెంచి డిసెంబర్ నెలలో పరీక్షలను నిర్వహించాలని గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రూప్-2 అభ్యర్థులు మాట్లాడారు.