Discount on SUV: ఈ SUVపై రూ. 4.75 లక్షల తగ్గింపు.. డిసెంబర్ 31 వరకే ఆఫర్!
- ఈ ఎస్‌యూవీపై బంపర్ ఆఫర్
- ఏకంగా రూ. 4.75 లక్షల తగ్గింపు
- డిసెంబర్ 31 వరకు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీప్ ఇండియా తన ప్రీమియం, అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ జీప్ కంపాస్‌పై డిసెంబర్‌లో భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ మోడల్‌పై వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. వినియోగదారుల ఆఫర్‌పై రూ. 3.20 లక్షలు, కార్పొరేట్ ఆఫర్ కింద రూ. 1.40 లక్షలు తగ్గించింది. వీటన్నింటితో పాటు కంపెనీ దీనిపై రూ.15,000 ప్రత్యేక ఆఫర్ కూడా ఇస్తోంది. దీంతో మీరు ఈ SUVపై రూ. 4.75 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఆఫర్ డిసెంబర్ నెల వరకే పరిమితం. ఇదిలా ఉండగా.. జీప్ ఇండియా కొత్త కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ను, సరికొత్త అప్ డేట్స్ తో అక్టోబర్ 3 గురువారం రోజు లాంచ్ చేసింది. దీని ఫిచర్స్ గురించి తెలుసుకుందాం..
జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్: అప్ డేట్స్
ఎక్స్టీరియర్: హుడ్ లేదా బానెట్ డిజైన్ ను ఎస్ యూవీ తరహాలో రూపొందించడం జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లోని అత్యంత ముఖ్యమైన అప్ డేట్ గా భావిస్తున్నారు. హుడ్ మధ్య భాగంలో డెకాల్ ను అప్లై చేయడం వల్ల హుడ్ కొత్త డ్యూయల్-టోన్ లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్రంట్-గ్రిల్ లోని ఏడు స్లాట్లలో రెండవ స్లాట్లో మాత్రమే వెల్వెట్ రెడ్ యాక్సెంట్ కనిపిస్తుంది.
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్: కలర్ ఆప్షన్స్
జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ కోసం ఏడు ఎక్స్టీరియర్ పెయింట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెర్ల్ బ్లూ, సిల్వేరీ మూన్, బ్రిలియంట్ బ్లాక్, ఎక్సోటికా రెడ్, మెగ్నీషియో గ్రే, టెక్నో మెటాలిక్ గ్రీన్, గెలాక్సీ బ్లూ ఉన్నాయి.
ఇంటీరియర్స్: జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ఇంటీరియర్స్ ను కూడా మార్చారు. ఈ లేటెస్ట్ ఎడిషన్ ప్రముఖ వెల్వెట్ రెడ్ సీట్ కవర్లతో మరింత అధునాతనంగా, స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులో మరికొన్ని యాక్ససరీలను కూడా యాడ్ చేశారు. వీటిలో డ్యూయల్-ఛానల్ రికార్డింగ్ సామర్థ్యం, వైట్ యాంబియంట్ లైటింగ్ కలిగి ఉన్న ఇంటిగ్రేటెడ్ డాష్ కామ్ ముఖ్యమైనది.
జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్: ముఖ్య ఫీచర్లు
కొత్త జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లోని ఫీచర్లు సాధారణ ఎడిషన్ జీప్ కంపాస్ లో అందించే ఫీచర్లకు చాలా భిన్నంగా ఏమీ లేవు. కొత్త ఎడిషన్ లో కూడా 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ప్యాన్ పనోరమిక్ సన్ రూఫ్, జీప్ లైఫ్ కనెక్టివిటీ సూట్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. కంపాస్ ఇతర వేరియంట్ల మాదిరిగానే 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!