తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మళ్లీ ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్చలు ప్రారంభించకపోవడంతో డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు 101 మంది రైతుల ‘జాతా’ ప్రారంభమవుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.
READ MORE: Akshara Gowda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మాస్ కా దాస్ హీరోయిన్
రైతుల బృందం డిసెంబర్ 6 న ఢిల్లీ వైపు బయలుదేరింది. అయితే హర్యానా పోలీసులు వారిని శంభు సరిహద్దు వద్ద ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వారిని ఆపడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇందులో కనీసం 16 మంది రైతులు గాయపడ్డారు. దీని తరువాత, రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధర్ రెండు రోజుల పాటు ఢిల్లీ మార్చ్‌ను నిలిపివేశారు. కేంద్రం నుంచి చర్చల కోసం ఏదైనా ప్రతిపాదన వస్తే.. రేపటి వరకు వేచి ఉంటామన్నారు. కేంద్రంతో తమకు ఎలాంటి విభేదాలు అక్కర్లేదని.. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు.
READ MORE:Pushpa 2 : పుష్ప-2 టికెట్ రేట్ అందరికి అందుబాటులో ఉంటుంది : మైత్రీ నిర్మాతలు
కాగా.. నేడు రైతులకు అడ్డుకునేందుకు నిరసనకారులు ఢిల్లీ వైపు వెళ్లకుండా సరిహద్దులో బారికేడింగ్ పటిష్టంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రోడ్లపై ఇనుప మేకులను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్‌తో పాటు మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. ఈ సస్పెన్షన్ డిసెంబర్ 9 వరకు అమల్లో ఉంటుంది.