Group-2: గ్రూప్ 2 పోస్టులను పెంచి డిసెంబర్ నెలలో పరీక్షలను నిర్వహించాలని గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రూప్-2 అభ్యర్థులు మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రకటించిన 783 గ్రూప్-2 పోస్టులకు అలాగే పరీక్షల నిర్వహించకుండా ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా పోస్టులను పెంచి డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని అన్నారు. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్యలో ఒకే రోజు సమయం ఉండడం వల్ల విద్యార్థులకు అన్ని పరీక్షలు రాసుకునేందుకు వీలు లేకుండా పోయిందని అన్నారు. అలా కాకుండా విద్యార్థులు అన్ని పరీక్షలు రాసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: Manchu Vishnu : సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలను ఇక సహించం.. మంచు విష్ణు వార్నింగ్